టీ20 ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు విజయంతో బోణీ కొట్టింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. వెస్టర్న్ ఆస్ట్రేలియా145 పరుగులకే పరిమితమైంది. అయితే.. ఈ మ్యాచులో బరిలోకి దిగని టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ మ్యాచ్ ముగిశాక బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. దీన్ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
ఈ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీపై భారీ అంచనాలనున్నాయి. టన్నులు కొద్దీ పరుగులు చేస్తున్నా ఒంటి చేత్తో వరల్డ్ కప్ సాధించిపెట్టిన ఘనతలు కోహ్లీ ఖాతాలో లేవు. కనీసం ఇప్పుడైనా ఆ లోటును పూడ్చాలని కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడని కోహ్లీ.. మ్యాచ్ ముగిసిన అనంతరం చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్.. దగ్గరుండి మరీ కోహ్లీకి బాల్స్ అందించాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Thousands of fans were in the stadium even after the practice match just to watch Virat Kohli’s batting practice. Virat Kohli practicing batting alongside with KL Rahul. pic.twitter.com/cSZqwLd8W0
— CricketMAN2 (@ImTanujSingh) October 10, 2022
Nice gesture from Virat Kohli to give autograph to fans ahead of the warm up match. pic.twitter.com/baQulbApg6
— Johns. (@CricCrazyJohns) October 10, 2022
కాగా, వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టుకు అనుకున్నంత ప్రాక్టీస్ లభించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ (3), రిషభ్ పంత్ (9) వెంటవెంటనే ఔటయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా (22) పరుగులతో పర్వాలేదనిపించగా, నాలుగో స్థానంలో వచ్చిన సూర్య (35 బంతుల్లో 52) ఎప్పటిలానే తనదైన మెరుపులతో మెరిపించాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా (22), దినేశ్ కార్తీక్ (19) ధాటిగా ఆడారు. అనంతరం 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు.. 145 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, భువనేశ్వర్, చాహల్ రెండేసి వికెట్లతో రాణించారు.
Innings Break!#TeamIndia post a total of 158/6
Suryakumar Yadav 52 off 35 (3×4, 3×6)
Hardik Pandya 29 off 20 pic.twitter.com/ghN3R0coqr— BCCI (@BCCI) October 10, 2022