క్రీడా ప్రపంచంలో మినీ యుద్ధం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. టీ20 ప్రపంచ కప్2022 లో భాగంగా తొలి పోరులో శ్రీలంక-నమీబియా జట్లు తలపడనున్నాయి. అయితే ఇప్పటికే అన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని ప్రారంభించే ముందు.. జట్టు కెప్టెన్లతో ఫొటో సెషన్ ను నిర్వహించడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. దానిలో భాగాంగానే తాజాగా వరల్డ్ కప్ లో పాల్గొంటున్న 16 టీమ్ ల కెప్టెన్లతో ఫొటో సెషన్ నిర్వహించింది యాజమాన్యం. అదీ కాక పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పుట్టిన రోజు కూడా కావడంతో అతడి చేత కేక్ ను కట్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫొటో సెషన్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన క్రీడ. మరి అలాంటి క్రీడలో మెగా టోర్నీ ప్రారంభం కాబోతుంది అంటే.. అభిమానుల్లో ఉత్సాహాం, ఆత్రుత రెండూ ఉంటాయి. వారి ఉత్సాహాన్ని, ఆత్రుతను పరిగణించిన యాజమాన్యం.. అందుకు తగ్గట్లుగానే టీ20 వరల్డ్ కప్ ను ముందుకు తీసుకుపోతోంది. దానిలో భాగంగానే ప్రపంచ కప్ లో పాల్గొనబోయే 16 టీమ్ ల సారథులతో ఫొటో సెషన్ ను నిర్వహించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అందరి కెప్టెన్లతో సహ సెల్ఫీ దించగా.. ఇద్దరు ఇద్దరు సారథులు దిగిన పిక్స్ మరింత సరదాగా ఉన్నాయి. ముందుగా దాయది దేశమైన పాకిస్థాన్ కెప్టెన్ ను నవ్వుతూ.. రోహిత్ శర్మ కౌగిలించుకునే పిక్ వార్తల్లో నిలిచింది. మరో ఎండ్ లో ఫించ్-బట్లర్ లు ఏకంగా కొట్టుకుంటారా? అన్న చూపులతో ఫొటో కు పోజిచ్చారు. మరోవైపు జింబాబ్వే-వెస్టిండీస్ సారథులు సరదాగా నవ్వులు చిందిస్తూ పోజులిచ్చారు.
The teams have arrived in Australia 📸 pic.twitter.com/kTTEgorUVu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 15, 2022
ఈ క్రమంలో నెదర్లాండ్-యూఏఈ కెప్టెన్లు బాక్సింగ్ పోజుతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బాబర్ అజామ్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కేక్ తెచ్చివ్వగా బాబర్ కేక్ కట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ కూడా వైరల్ గా మారాయి. మైదానంలో చిరుత పులుల్లా గాండ్రించుకునే కెప్టెన్లు.. ఈ పిక్ సెషన్ లో మాత్రం సరదాగా నవ్వుతూ ఉన్నారు. దాంతో ఈ ఫొటోలు చూసిన అభిమానులు..”మీరందరు ఇలా నవ్వుతూ.. కలిసి మెలిసి ఉండటం చూస్తూంటే మాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు..”మీరు హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా పొజులిస్తున్నారు.. సినిమాల్లో ట్రై చేయోచ్చుగా బ్రోస్” అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Aaron Finch presents Babar Azam with a birthday cake 🎂
📹: ICC | #T20WorldCup pic.twitter.com/FwduQV1fAp
— Grassroots Cricket (@grassrootscric) October 15, 2022
#NewCoverPic pic.twitter.com/OsIltvpA7E
— ESPNcricinfo (@ESPNcricinfo) October 15, 2022