టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ.. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం బుమ్రా రీప్లేస్‌మెంట్‌గా జట్టులో చేరాడు. ఇటివల నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన షమీ.. అటునుంచి అటే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. గాయం కారణంగా బుమ్రా వరల్డ్ కప్‌కు దూరం అవ్వడంతో అనూహ్యంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న షమీ.. నెట్స్‌లో చెమటొడుస్తున్నాడు. భారత బ్యాటర్లకు బౌలింగ్ చేస్తూ.. మంచి టచ్‌లో కనిపించాడు. ఇదే క్రమంలో పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీకి బౌలింగ్ టిప్స్ చెప్తూ కనిపించాడు. ప్రస్తుతం షమీ.. షాహీన్ అఫ్రిదీకి కోచింగ్ ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్వింగ్ కింగ్‌గా పేరున్న షమీ.. బాల్‌పై గ్రిప్ ఎలా తీసుకోవాలో అఫ్రిదీకి నేర్పిస్తున్నట్లు ఉంది ఆ ఫొటోలలో.
ఇక ఈ ఆసక్తికరమైన కలయిక.. భారత్-ఆస్ట్రేలియా వామప్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా.. గాబా వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వామప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక టీమిండియా బౌలింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలోకి పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు వచ్చాయి. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత.. పాక్-ఇంగ్లండ్ వామప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం స్టేడియానికి చేరుకున్న పాక్, ఇంగ్లండ్ ఆటగాళ్లు డకౌట్‌లో కూర్చున్న భారత ఆటగాళ్లతో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే మొహమ్మద్ షమీ పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీతో మాట్లాడుతూ.. బౌలింగ్ గురించి ఏదో చెబుతూ కనిపించాడు. వీరి ఫొటోలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతున్న తొలి వామప్ మ్యాచ్‌కు షమీకి రెస్ట్ ఇచ్చారు. న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో షమీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక టీమిండియా 23న పాకిస్థాన్‌తో తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో మూడు వికెట్లతో సత్తా చాటిన అఫ్రిదీ.. మళ్లీ 23 భారత్‌పై బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా అతను ఆసియా కప్ ఆడని విషయం తెలిసిందే.
The @T20WorldCup stage 🤝#WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/J30eifvim8
— Pakistan Cricket (@TheRealPCB) October 17, 2022
ఇది కూడా చదవండి: T20 World Cup: సూపర్ డెలవరీతో దినేష్ కార్తీక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ