వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ.. ఆ తరువాత కొద్ది సేపటికే స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షణాఫ్రికా సిరీసులకు కూడా జట్లను ప్రకటించారు. వేరు వేరు జట్లుగా ఎంపిక చేసినప్పటికీ.. ఒకటి, రెండు మినహా పెద్దగా మార్పులు కనిపించట్లేదు. ఆసియా కప్ రిజల్ట్ చూసి కూడా తీరు మార్చుకోని సెలక్టర్లు.. దాదాపు అదే జట్టునే మరోసారి కొనసాగించారు. ఈ జట్టులో యువ ఆటగాడు సంజు శాంసన్ కు చోటు కల్పించకపోవడంపై ఒకవైపు విమర్శలొస్తుంటే.. మరోవైపు టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది.
అది వన్డే అయినా.. టెస్టు అయినా.. అఖరకు సోషల్ మీడియా అయినా శిఖర్ ధావన్ పెర్ఫార్మన్స్ బాగోలేదు అన్న సందర్భాలు చాలా తక్కువ. ధావన్.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. మన జట్టుకు లోటున్నది కూడా అక్కడే. లెఫ్ట్ – రైట్ కాంబినేషన్ ఉన్నప్పుడు బౌలర్లు తికమక పడే సందర్భాలు చాలా ఎక్కువ. అందులోనూ. ఈ వెటరన్ క్రికెటర్ నిలకడగా ఆడటమే కాదు, వేగంగా ఆడగలడు. స్ట్రైక్ రొటేట్ చేయగలడు. ఏ రకంగా చూసిన.. కెఎల్ రాహుల్ తో పోలిస్తే బెస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి ఆటగాడికి.. ఇప్పుడు టీ20 జట్టులో చోటుదక్కడం లేదు. ఏ సిరీస్ అయినా.. ఏ జట్టైనా బెంచ్ కే పరిమితం. బీసీసీఐ చేస్తున్న ఈ చర్యలతో ధావన్ కు ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. రాహుల్ కోసమే బీసీసీఐ, ధావన్ ను తొక్కేస్తుంది అన్న విమర్శలు వస్తున్నాయి.
Sorry but this statpadder K L Rahul can never become a better opener than Shikhar Dhawan.#INDvsSL pic.twitter.com/ZqVfugSKaK
— Garvish J (@GarvishJ1) September 6, 2022
టాలెంట్ ఉన్నప్పుడు.. మేము వయసును పరిగణలోకి తీసుకోమని చెప్పే బీసీసీఐ.. ఆ దిశగా మాత్రం ఆలోచన చేయడం లేదు. వన్డేల్లో అవకాశం ఇస్తున్నా.. టీ20ల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా! అని ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు కల్పించారు. కాగా, ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై ధావన్ స్పందించిన సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో జట్టుకు తాను ఎందుకు ఎంపిక కావట్లేదో తనకు తెలియదని ఒకింత నిరాశతో చెప్పిన ధావన్.. ఇక ఆ విషయం గురించి తాను పెద్దగా ఆలోచించనని, వచ్చిన అవకాశాల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలనే దానిపైనే దృష్టి సారిస్తానని చెప్పాడు.
‘నిజాయితీగా చెప్తున్నా.. టీ20 జట్టులోకి నన్ను ఎందుకు తీసుకోవట్లేదో నాకే తెలియదు. వాళ్ల దగ్గర ఏదైనా కారణం ఉండొచ్చు. ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవాలని అనుకోవడం లేదు. నేను చాలా కాలంగా భారత జట్టు టీ20 ఫార్మాట్లో ఆడలేదు.. నన్ను ఏ ఫార్మాట్లో.. ఎప్పుడు ఎంపిక చేస్తారో అన్నది కూడా నాకు తెలియదు. నాకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా పని” అని చెప్పుకొచ్చాడు. రాహుల్ కోసమే ధావన్ ను తొక్కేస్తున్నారా? ఈ వార్తల్లో నిజమెంత? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Most Runs.. After 2019 World Cup pic.twitter.com/AW7gdyvPb4
— Govardhan Reddy (@gova3555) September 12, 2022