టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ ఆదివారం ప్రతిష్టాత్మకమైన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే దానికి ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఇరు దేశాల క్రికెట్ అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. మరి ఇంత సీరియస్‌గా జరిగే మ్యాచ్‌లో పైచేయి సాధించాలనే కసి రెండు జట్లలోనూ ఉంటుంది. అందుకే తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను బరిలోకి దించుతారు. కాగా పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత జట్టుపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
ధోని మెంటర్‌గా, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్న జట్టులో వ్యూహ రచన మరింత బలంగా ఉంటుంది. అందుకే ఈ పాక్‌తో మ్యాచ్‌కు భారత్ బెస్ట్ టీమ్‌ను బరిలోకి దింపనుంది. జట్టు కూర్పులో మెంటర్‌గా ధోని మార్క్ స్పష్టంగా కనిపించనుంది. ఎందుకంటే ఏ ఆటగాడి సామర్థ్యం ఏంటో ధోనికి బాగా తెలుసు. ఆటగాళ్ల బలాబలాలను అంచనా వేయడంలో ధోని, కోహ్లీ దిట్టలు. ఇకపోతే పాక్‌తో మ్యాచ్‌కు ముందు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడిన భారత్ అద్భుతమైన ఫామ్‌ను చూపించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను ఓడించి అసలు సమరానికి ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.
ఇదీ చదవండి: విరాట్, రోహిత్ అసలైన లీడర్లు.. దేశమే తమకు ముఖ్యమని నిరూపించారు
మొదటి మ్యాచ్‌లో ఓపెనర్లుగా కేఎస్ రాహుల్, ఇషాన్ కిషన్ వచ్చారు. ఇద్దరూ అద్భుతంగా ఆడారు. రెండో మ్యాచ్‌లో రాహుల్‌కు జతగా రోహిత్ శర్మ ఓపెనర్‌గా వచ్చాడు. వీళ్లిద్దరు కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఎవరు ఓపెనింగ్ చేస్తారు అనే డౌట్ అందరికి వచ్చింది. కాగా ఈ విషయంలో విరాట్ కోహ్లీ పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్-రోహిత్ శర్మ జోడికే విరాట్ మొగ్గుచూపాడు. అలాగే వన్‌డౌన్‌లో విరాట్ స్థానం పదిలం. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్ ఆడొచ్చు. కీపర్‌గా పంత్ పక్కా, ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజా ఉన్నారు. ఇద్దరిలో ఒకరు లేదా ఇద్దరూ తుది జట్టులో ఉంటారు. ఇక స్పిన్నర్‌గా అశ్విన్ ఉంటాడు. రాహుల్ చాహర్‌కు ప్లేస్ కష్టమే. వరణ్ చక్రవర్తికి చోటు దక్కేఅవకాశం ఉంది. ఇక పేస్ విషయంలో షమి, బుమ్రా కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారు.
తుది జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజా, అశ్విన్/వరణ్ చక్రవర్తి, శార్దుల్ ఠాకుర్, మొహామ్మద్ షమీ, బుమ్రా (అంచనా)
ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. షాక్‌లో అభిమానులు