ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు అనే విధంగా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తొలి రోజు బంగ్లాదేశ్‌ను ఓడించి స్కాట్లాండ్ గట్టి షాకే ఇచ్చింది. మరోవైపు ఒమన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్ గెలిచేసింది. రెండోరోజు కూడా మంచి ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లు సాగుతున్నాయి. నెదర్‌ల్యాండ్స్- ఐర్లాండ్ మ్యాచ్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్క ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ బౌలర్ రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి: లోబో సీక్రెట్ రూమ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్! ఈసారి దారుణంగా విఫలమైన బిగ్ బాస్!
ఐర్లాండ్ అనగానే అంత క్రికెట్ ప్రాభవం ఉన్న దేశం కాదని అందరికీ తెలుసు. ఆ దేశం తరఫున ఒక బౌలర్ అరుదైన ఘనత సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్‌ల్యాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. అలా కూలదోసింది ఎవరో కాదు.. కర్టిస్ క్యాంఫర్. పదో ఓవర్‌లో బాల్ అందుకున్న కర్టిస్ తొలి బాల్ వైడ్ రెండో బాల్ డాట్‌గా వేశాడు. తర్వాత వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ ట్వంటీల్లో వరుసగా నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కర్టిస్ రికార్డుల కెక్కాడు. అతని కంటే ముందు ఈ ఘనతను రషీద్ ఖాన్, లసిత్ మలింగా సాధించారు. ఆ దిగ్గజాల సరసన ఐర్లాండ్ ప్లేయర్ కర్టిస్ చేరాడు.
4️⃣in4️⃣ for Curtis Campher #T20WorldCup #Netherlands
Rashid Khan and Lasith Malinga are the only bowlers to take four wickets in four balls in T20Is pic.twitter.com/7GIXohJOhd— sandyzzz (@film_geek_guy) October 18, 2021
A feat from Curtis Campher that we will never forget 🤩#T20WorldCup #IREvNED https://t.co/b4sMsUsADo
— ICC (@ICC) October 18, 2021