ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ వేరు. ఇక వరల్డ్ కప్ మ్యాచ్, అది కూడా ఇండియా పాకిస్థాన్ మధ్య అయితే.., ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోవడం గ్యారంటీ. ఈ రసవత్తర పోరుకి ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్ వేదిక కానుంది. ప్రపంచకప్ లో ఇండియా పాకిస్తాన్ జట్లు గ్రూప్-2 లో ఉన్నాయి. దీంతో.., దాయాది దేశంతో తలపడే రోజు ఎప్పుడా అని క్రికెట్ ప్రేమికులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., తాజాగా ఐసీసీ మ్యాచ్ డేట్స్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 17 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.., చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్థాన్ దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న తలపడనున్నాయి.
రోహిత్, కోహ్లీ, ధావన్, రాహుల్ వంటి సీనియర్స్ కి.. సూర్యకుమార్ యాదవ్, పంత్, అయ్యర్ వంటి జూనియర్స్ యాడ్ కావడంతో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో పాక్ టీమ్ కూడా ఈ మధ్య టీ-ట్వంటీలలో బలమైన జట్టుగా అవతరించింది.
ఫకర్ జమన్, బాబర్ అజామ్, రిజ్వాన్, షాన్ అఫ్రీది వంటి ఆటగాళ్లు మంచి టచ్ లో ఉండటం పాకిస్థాన్ కి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. మరి.. జట్ల పరంగా నువ్వా, నేనా అన్నట్టు ఉన్న ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరి.. ఇప్పుడు జట్లకున్న బలాబలాను బట్టి.. ఈ మ్యాచ్ లో ఏ టీమ్ విజయం సాధిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.