ఇంగ్లాండ్ వేదికగా జరిగే టీ20 బ్లాస్ట్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. లాంకాషైర్, హాంప్‌షైర్ జట్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాంప్‌షైర్ ఆఖరి బంతికి విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన క్రమంలో లాంకాషైర్ ఆటగాడు రిచర్డ్ గ్లీసన్‌ను నాథన్ ఎల్లీస్ క్లీన్ బౌల్డ్ చేయడంతో హాంప్‌షైర్ విజయం ఖరారైంది. దీంతో హాంప్‌షైర్ ఆటగాళ్లు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. అయితే అప్పుడే హాంప్‌షైర్ ఆటగాళ్లకు గుండె పగిలే వార్త చెప్పాడు ఫీల్డ్ అంపైర్. ఆఖరి బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.
అంపైర్ నిర్ణయంతో.. గ్రౌండ్‌లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆఖరి బంతి నో బాల్ (ఫ్రీ హిట్‌తో పాటు అదనపు పరుగు) కావడంతో సమీకరణలు మారిపోయాయి. ప్రత్యర్థి జట్టుకు చివరి బంతికి 3 పరుగులు మాత్రమే కావాలి. ఈ పరిస్థితుల్లో ఎల్లీస్ చాకచక్యంగా స్లో బాల్ వేయడంతో బైస్ రూపంలో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చి.. పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. ఈసారి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాణసంచా పేలుస్తూ గ్రౌండ్‌లో హంగామా సృష్టించారు. ఆఖరి బంతికి నెలకొన్న హైడ్రామాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసిన అభిమానులు.. క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ ఎన్నడూ చూడలేదని, టీ20ల్లో ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారని కామెంట్స్ చూస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Absolute drama in the #T20Blast final 🤯
Wow! 🔥
— Sportskeeda (@Sportskeeda) July 17, 2022
James Vince has featured in every one of Hampshire’s nine Finals Day appearances.
He’s scored the most runs of any player in the T20 Blast this year.
In the final, he’s inspired the Hawks to their first title in nine years.
👏 Hampshire legend.#Blast22 pic.twitter.com/lpOMXvWWss
— bet365 (@bet365) July 16, 2022
ఇది కూడా చదవండి: కోహ్లీ అంటేనే ఒక బ్రాండ్.. అతన్ని తప్పిస్తే అన్ని బోర్డులకు కోట్లలో నష్టం: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
ఇది కూడా చదవండి: సుప్రీం కోర్టును ఆ శ్రయించిన బీసీసీఐ.. గంగూలీ- జైషా పదవులకు గండం..?