తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నటరాజన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ యార్కర్ల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలు ఎక్కనుంది. ఐపీఎల్ కంటే ముందు జరిగే మినీ ఐపీఎల్‌లో తన బౌలింగ్ పదును చూపించేందుకు నటరాజన్ సిద్ధమవుతున్నాడు.
అరంగేట్రం సిరీస్‌లోనే అన్ని ఫార్మాట్లు ఆడిన తొలి భారత క్రికెటర్, ఐపీఎల్‌ల్లో పదునైన యార్కర్లతో బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీ.నటరాజన్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. 2020-21లో టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన నటరాజన్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టెస్టు, వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసి.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఐపీఎల్‌ల్లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.
ఆ తర్వాత గాయాలతో ఆటకు దూరమైన నటరాజన్ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. తమిళనాడుకు చెందిన నటరాజన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడటంతో తెలుగువారికి చాలా దగ్గరయ్యాడు. దీంతో.. అతను మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడని తెలియడంతో క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు వేదికగా జరిగే.. మినీ ఐపీఎల్‌గా పేరొందిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ కోసం గురువారం వేలం జరిగింది. ఈ వేలంలో నటరాజన్‌ను బాల్సీ తిరుచ్చి జట్టు రూ.6.25 లక్షలకు కొనుగోలు చేసింది.
దీంతో.. ఈ సీజన్‌లో నటరాజన్ బాల్సీ తిరుచ్చి తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌ల్లో సన్‌రైజర్స్‌తోనే ఉన్న నటరాజన్ ఈ సారి ఐపీఎల్‌లో అదరగొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. గత సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 18 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన నటరాజన్ 3 వికెట్లు, 2 వన్డేల్లో 3 వికెట్లు, 4 టీ20ల్లో 7 వికెట్లు తీసుకున్నాడు. మరి నటరాజన్ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
After missing out in action for almost two years for India, Varun Chakaravarthy and T Natarajan are set to play Tamil Nadu Premier League 2023.#CricTracker #TNatarajan #VarunChakaravarthy pic.twitter.com/yJogtv08TS
— CricTracker (@Cricketracker) February 23, 2023