టీమిండియా యువ క్రికెటర్, ఆర్సీబీ మాజీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ వీర విహారం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. పడిక్కల్ ధాటికి పడిక్కల్ ధాటికి మహారాష్ట్ర బౌలర్లు చేతులెత్తేయడం మినహా ఏమి చేయలేకపోయారు. ఇన్నింగ్స్ ముగిసేసరికి కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.
దేశవాళీ టీ20 లీగ్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 38 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ టీ20 ఫార్మాట్ లో సాగుతోంది. అందులో భాగంగా ఇవాళ కర్ణాటక, మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దేవ్‌దత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్, కృష్ణప్ప గౌతమ్.. ఇలా టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లందరితో కూడిన కర్ణాటక జట్టు అందుకు తగ్గ ప్రదర్శనే చేసింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన కర్ణాటక బ్యాటర్లు ఆరంభం నుంచే చెలరేగిపోయారు. తొలుత 28 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్(28; 17 బంతుల్లో, 6 ఫోర్లు) వెనుదిరిగితే.. ఆపై 182 పరుగుల వద్ద మనీష్ పాండే(50; 38 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) రెండో వికెట్ కోల్పోయింది.
First centurion of 2022/23 Syed Mushtaq Ali Trophy – Devdutt Padikkal#CricTracker #DevduttPadikkal #SMAT2022 pic.twitter.com/wsIhe1aeby
— CricTracker (@Cricketracker) October 11, 2022
ఈ మ్యాచులో ఆర్సీబీ మాజీ క్రికెటర్ దేవ్‌దత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 62 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పడిక్కల్ ధాటికి మహారాష్ట్ర బౌలర్లు చేతులెత్తేయడం మినహా ఏమి చేయలేకపోయారు. ఇక 2018లో ఆర్సీబీ తరుపున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్ 2021 వరకు ఆర్సీబీతోనే కొనసాగాడు. గత సీజన్ నుండి రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడయ్యాడు. కాగా, ఐపీఎల్ లో రాణించిన పడిక్కల్ జాతీయ జట్టు తరుపున కూడా ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో ఆరంగ్రేటం చేశాడు.