నిన్న( ఎప్రిల్ 24) భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కూడా సచిన్ కి ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. అదేంటంటే ?
భారత క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో సచిన్ ది ఒక ప్రత్యేక స్థానం. తన బ్యాటింగ్ తో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు మరెవ్వరికీ సాధ్యం కానీ రివార్డులు తన పేరు మీద లిఖించుకున్నాడు. కెరీర్ అంతా ఎలాంటి వివాదాలకు పోకుండా ఎంత సాధించినా ఒదిగి ఉండాలనే దానికి ఉదాహరణగా నిలిచాడు. అందుకే క్రికెట్ కి వీడ్కోలు పలికిన ఇప్పటికీ మాస్టర్ బ్లాస్టర్ ని ఆరాధించేవారుంటారు. ఈ గొప్పతనమే ఇప్పుడు సచిన్ ని మరో మెట్టెకించింది. నిన్న (ఏప్రిల్ 24) సచిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశమంతా సంబరాలు జరుగుతుంటే.. ఆస్ట్రేలియా దేశం కూడా అరుదైన గౌరవాన్ని సచిన్ కి ఇచ్చింది.
భారత క్రికెట్ దిగ్గజం ,క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. దేశంలో క్రికెట్ లవర్స్ ,ప్లేయర్లు సచిన్ కి వారి బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆస్ట్రేలియా సచిన్ పుట్టిన రోజు సందర్భంగా ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. గిఫ్ట్ అంటే ఏదో చిన్నది అనుకుంటే పొరపాటే. ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ గేట్ కి సచిన్ పేరు పెట్టారు. విజిటింగ్ క్రికెటర్లు ఈ గేట్ ద్వారానే లోపలి ప్రవేశిస్తారు. ఈ విషయాన్ని క్రికెట్ డాట్ కామ్ AU ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. క్రికెట్ ని శాసించే ఆస్ట్రేలియా జట్టులో దిగ్గజాలకు కొదువ లేదు. అయినా మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి ఈ గౌరవం దక్కడం దేశానికే గర్వ కారణం. దీనికి సంబంధిన ఫోటోలను కూడా షేర్ చేసింది. మరో గేట్ కి విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పేరు పెట్టారు.
ఈ విషయమై సచిన్ స్పందించాడు. భారత్ తర్వాత నాకిష్టమైన క్రికెట్ గ్రౌండ్ SCG( సిడ్నీ క్రికెట్ గ్రౌండ్). నేను 1991-92 లో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ నాకెన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. విజిటింగ్ క్రికెటర్ల ప్రవేశ ద్వారమైన గేట్లకు నాతో పాటు నా స్నేహితుడు లారా పేర్లు పెట్టినందుకు చాలా ఆనదంగా ఉంది. దీనిని నేను అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా SCG కి నా ధన్యవాదాలు. త్వరలోనే నేను సిడ్నీని సందర్శిస్తాను అని తెలియజేశాడు. మరి సచిన్ కి లభించిన గౌరవం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.