టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి, శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా..
టీమిండియా స్టార్ క్రికెటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి, శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మంగళవారం తిరుమల చేరుకున్న సూర్యకుమార్ యాదవ్.. సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్ యాదవ్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే.. సూర్యకుమార్ యాదవ్‌ను స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకునే క్రమంలో అభిమానులు, అక్కడున్న భక్తులు అతనితో స్పెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో సూర్యకుమార్ దంపతులు కాస్త ఇబ్బంది పడ్డారు.
దైవభక్తి ఎక్కువగా ఉన్న సూర్యకుమార్ యదవ్.. దేశంలోని ప్రముఖ దేవాలయాలను ఇప్పటికే చాలా వరకు సందర్శించాడు. ఇటివల తిరువనంతపురంలో మ్యాచ్ సందర్భంగా పద్మనాభస్వామివారిని దర్శించుకున్న సూర్య.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు కాస్త సమయం లభించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సతీసమేతంగా వచ్చాడు. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో సాంప్రదాయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి సూర్య.. రెండో టెస్టు ఆడలేదు. అయితే.. చివరి రెండు టెస్టులకు కూడా సూర్యను ఎంపిక చేయడంతో సూర్యకు మరో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. టెస్టుల్లో సూర్యకు అంత మంచి రికార్డు లేకపోయినా.. టీ20 క్రికెట్‌లో మాత్రం అతనే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. మరి సూర్య కెరీర్‌తో పాటు స్వామివారి దర్శన భాగ్యం పొందడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
கிரிக்கெட் வீரர் சூர்யகுமார் யாதவ் குடும்பத்துடன் ஏழுமலையான் கோயிலில் வழிபாடு #SuryakumarYadav | #Tirupati | #IndianCricketPlayer pic.twitter.com/iA5AmN8Wq0
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) February 21, 2023