మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఎలాంటి విధ్వంస సృష్టించాడో చూశాం. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ సూర్య సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అంతకంటే ముందు కూడా టీమిండియా టీ20 జట్టులో సూర్య ఒక సంచలనం. భారత జట్టులోకి లేటుగా వచ్చినా.. లేటెస్టుగా దుమ్ములేపిన ఒక థండర్ బోల్ట్. టీ20ల్లో సూర్య ఎలాంటి బ్యాటింగ్ చేయగలడో మనందరికి తెలుసూ.. అయితే, సూర్య కేవలం టీ20లకు మాత్రం పరిమితం కావాలని అనుకోవడం లేదు. టీ20లతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్స్‌లో సైతం సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.
సూర్యకుమార్ యాదవ్‌ను టీ20లతో పాటు వన్డేలకు సైతం ఎంపిక చేశారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు సూర్యను సెలెక్ట్ చేశారు. అయితే టీ20ల్లో రాణించిన సూర్య.. వన్డేల్లో మాత్రం విఫలం అయ్యాడు. తొలి వన్డేలో 4, చివరి వన్డేలో 6 పరుగులు చేసిన సూర్య.. వర్షం కారణంగా మధ్యలోనే రద్దయిన రెండో వన్డేలో మాత్రం 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్ జరిగి ఉంటే సూర్య నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చే అవకాశం ఉండేది. కానీ.. వర్షం కారణంగా సూర్యకు నిరాశే మిగిలింది. ఒక వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సూర్యకుమార్‌కు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అలాగే సూర్య ఇంతవరకు టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టలేదు.
టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడటం తన కలగా చెప్పుతున్న సూర్య.. దాని కోసం దేశవాళీ క్రికెట్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ముంబై తరఫున ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ సోమవారం ముంబై-హైదరాబాద్ మధ్య ప్రారంభమైన మ్యాచ్‌లో సూర్య వన్‌డౌన్‌లో బ్యాటింగ్ వచ్చి.. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 90 పరుగులు చేసి సూర్య.. హైదరాబాద్ బౌలర్ శశాంక్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటై.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే.. 80 బంతులు ఆడి 90 పరుగులు చేశాడంటే.. సూర్య చాలా నిదానంగా ఆడాడంటూ.. టెస్టుల్లో ఆడేందుకు పనికొచ్చేలా ఉన్నాడంటూ.. క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి సూర్య ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Suryakumar Yadav scored 90 runs from 80 balls in his return to Ranji after 3 years.
— Johns. (@CricCrazyJohns) December 20, 2022