పేలవ ప్రదర్శనతో నానా తంటాలు పడుతున్న సూర్య ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం దూసుకెళ్తున్నాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు డకౌట్ గా వెనుదిరిగినా సూర్య ర్యాంక్ ఏమాత్రం చెక్కు చెదరకపోవటం గమనార్హం.
సంచలన బ్యాటింగ్‌తో తెర మీదకు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ గతేడాది పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. అటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ, ఇటు ఐపీఎల్‌లోనూ రికార్డు స్థాయిలో పరుగులు చేశాడు. మైదానంలో నలువైపులా షాట్లు కొడుతూ ‘మిస్టర్ 360’ అని అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. టీ-20 క్రికెట్‌లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అనిపించుకున్నాడు. అలాంటి ఆటగాడు గత నెల రోజులుగాపేలవ ప్రదర్శనతో నానా తంటాలు పడుతున్నాడు. వరుస డకౌట్లతో రికార్డులు సృష్టిస్తున్నాడు. పోనీ ఇంతలా విఫలమవుతున్నా అతని ఐసీసీ ర్యాంక్ ఏమాత్రం చెక్కు చెదరకపోవటం గమనార్హం.
బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో సూర్య బ్యాటింగ్ విభాగంలో 906 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. తర్వాత స్థానాల్లో వరుసగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(811 పాయింట్లు), పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(755 పాయింట్లు), సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ (748 పాయింట్లు), న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే(745పాయింట్లు) ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి 15వ స్థానంలో ఉండగా.. మిగతా టీమిండియా బ్యాటర్లు ఎవరు టాప్-20లో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే సూర్య నెంబర్.1 స్థానంలో కొనసాగాడానికి కారణం.. అంతర్జాతీయంగా మ్యాచ్‌లు జరగకపోవడమే.
#SuryakumarYadav maintains top spot in #ICC #T20I rankings; #BabarAzam moves up to third
Read: https://t.co/X90i4dcPqq#Ranking pic.twitter.com/ytQPIlyh4s
— Cricket Fanatic (@CricketFanatik) April 12, 2023
సూర్యకు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ సిరీస్‌లో సూర్య ఒక్క పరుగు కూడా చేయలేదు. పైగా అన్ని మ్యాచ్‌ల్లోనూ తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై పెవిలియన్ చేరాడు. పోనీ ఐపీఎల్‌లో అయినా రాణిస్తాడనుకున్నా.. ఇక్కడే అదే తీరు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 12,1,0 పరుగులు చేశాడు. ఇందులో ఒక గోల్డెన్ డక్ కూడా ఉంది. ఇక గత ఆరు మ్యాచులు తీసుకుంటే.. 0 (1), 0 (1), 0 (1), 15 (16), 1 (2), 0 (1) = 16 చేశాడు. అందులో నాలుగు సార్లు డకౌట్ గా వెనుదిరిగిగాడు. త్వరలో దేశీయంగా ప్రపంచకప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సూర్య త్వరగా ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Four golden ducks in his last 6 innings now.
📸: IPL#MumbaiIndians #SuryakumarYadav #DelhiCapitals #DCvsMI #IPL2023 pic.twitter.com/DEMlrklFK4
— CricTracker (@Cricketracker) April 11, 2023
🤣🤣🤣🤣🤣🤣#SuryakumarYadav pic.twitter.com/nREE1OLwG4
— Kunal Krish Biswas. (@Meinrebelhoon) April 12, 2023