మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సూర్య.. 239 పరుగులతో టాప్ 3 రన్ స్కోరర్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. ఆ వెంటనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన సూర్య.. రెండో టీ20లో సెంచరీతో దుమ్మురేపాడు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు బాది, టీ20ల్లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. రెండు టీ20లు వర్షార్పాణం అయినా.. సూర్య సంచలన ఇన్నింగ్స్‌తో టీమిండియా 1-0తో న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆడుతున్న సూర్య.. తొలి వన్డేలో నిరాశ పర్చగా, రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇక మూడో వన్డేలో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.
ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. భవిష్యత్తులో సూర్యకుమార్ యాదవ్ జీవితం ఆధారంగా సినిమా వస్తే.. తన పాత్రను ఎవరు పోషించాలని అనుకుంటున్నారు? అని ఎదురైన ప్రశ్నకు.. శ్రేయస్ తాల్పడే అయితే బాగుంటుందని సూర్య పేర్కొన్నాడు. మరాఠీ నటుడైన తాల్పడే ఇప్పటికే మాజీ క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎవరూ ప్రవీణ్ తాంబే’ చిత్రంలో అద్భుతంగా నటించాడు. ఈ చిత్ర విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. పలు హిందీ చిత్రాల్లోనూ తాల్పడే నటించాడు.
అలాగే.. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో పాటు మీరు కూడా ఒక పరుగు పందెం పెడితే.. ఎవరు గెలుస్తారని ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. క్షణం ఆలోచించకుండా విరాట్ కోహ్లీ అని చెప్పాడు. కోహ్లీ ఫిట్‌నెస్ చాలా అద్భుతంగా ఉంటుందని అన్నాడు. టీమిండియాలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కంటే.. విరాట్ కోహ్లీ సీనియర్ ప్లేయర్. అయినా కూడా ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ టీమిండియాలోనే నంబర్‌వన్‌గా నిలుస్తాడు. అలాంటి కోహ్లీతో పరుగు పందెంలో పోటీ పెట్టుకుంటే కచ్చితంగా ఓడిపోవాల్సిందే. అయితే.. సూర్యకుమార్ యాదవ్-విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీమిండియా మంచి జోడీగా మారిపోయారు. వీరిద్దరి మధ్య మంచి భాగస్వామ్యాలు నమోదు అవుతున్నాయి. అలాగే ఒకరంటే ఒకరి ప్రత్యేక అభిమానం ఉంది.
Suryakumar Yadav and Virat Kohli have come a long way! pic.twitter.com/cmnpwROl88
— 12th Khiladi (@12th_khiladi) November 24, 2022