2023 టీమిండియాకు బాగా కలిసొచ్చేలా ఉంది. కొత్త ఏడాది మొదలై.. పాతిక రోజుల్లోనే జట్టులో అన్ని శుభసూచికాలే కనిపిస్తున్నాయి. టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీలతో ఫామ్ అందుకున్నారు. యువ క్రికెటర్లు రఫ్ఫాడిస్తున్నారు. ఇప్పటికే టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ టీమ్‌గా ఉన్న భారత్.. తాజాగా న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ విజయం తర్వాత వన్డే ఫార్మాట్‌లోనూ ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. మరోవైపు టెస్టుల్లో వరల్డ్ నంబర్ టూగా ఉంది. ఆ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ 3-1తో నెగ్గి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో గెలిస్తే.. టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇలా ఓవరాల్ టీమ్ ప్రదర్శన అద్భుతంగా ఉన్న తరుణంలోనే.. టీమ్‌లోని ఆటగాళ్లు సైతం అత్యుతమ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
భారత జట్టు మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీ20ల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఐసీసీ ప్రకటించింది. దీనికి తోడు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు అగ్రస్థానంలో కొనసాగుతుండటం మరో విశేషం. అందులోనూ.. మూడు వేర్వేరు ఫార్మాట్లు, మూడు వేర్వేరు విభాగాల్లో మనోళ్లు టాప్‌లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కొన్ని రోజులగా టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా కొన్ని నెలలుగా జట్టులో లేకపోయినా.. టెస్టు ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. తాజాగా టీమిండియా స్పీడ్ స్టర్, మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. 727 పాయింట్లతో ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్న ఆసీస్ బౌలర్ జోస్ హెజల్‌వుడ్‌ను వెనక్కి నెట్టి 729 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ బౌలర్ స్థానాన్ని అధిరోహించాడు.
ఇలా ప్రతి ఫార్మాట్‌లో ఒక విభాగంలో భారత ఆటగాడు టాప్‌లో నిలవడం నిజంగా విశేషమే. మూడు భిన్న ఫార్మాట్లు, మూడు భిన్న విభాగాల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాళ్లుగా నిలిచారు. వీరితో పాటు టాప్ 10 జాబితాను ఒక సారి పరిశీలిస్తే.. టీ20ల్లో టాప్ 10 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా టాప్ 3 ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. వన్డే ఫార్మాట్‌లో బ్యాటింగ్ విభాగంలో యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ప్రపంచ టాప్ 10 బ్యాటర్ల జాబితాలో 6వ స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ 7వ స్థానంలో, రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నారు. ఇక టెస్టు ఫార్మాట్ విషయానికి వస్తే.. ప్రపంచ టాప్ 10 టెస్టు బ్యాటర్ల లిస్ట్‌లో రిషభ్ పంత్ 7వ స్థానంలో, రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నారు. టెస్టుల్లో టాప్ 10 బౌలర్ల లిస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా 3, రవిచంద్రన్ అశ్విన్ 4వ స్థానంల్లో ఉన్నారు. అలాగే.. ప్రపంచ టాప్ 10 టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నంబర్ వన్‌గా ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 2గా ఉన్నాడు. ఇలా మన భారత్ ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నారు. టీమిండియా నుంచి టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, వన్డేలో శుబ్‌మన్ గిల్, టెస్టుల్లో రిషభ్ పంత్ నంబర్ ప్లేయర్లుగా ఉన్నారు. మరి ఈ ర్యాంకింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohammed Siraj surpasses New Zealand pacer Trent Boult and Australia seamer Josh Hazlewood to become the top-ranked ODI bowler for the very first time.
What a journey it has been for him 👏#CricTracker #MohammedSiraj #ICC pic.twitter.com/CwmjikWM5E
— CricTracker (@Cricketracker) January 25, 2023