టీమిండియా యువ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన సత్తా చాటాడు. భారత్-వెస్టిండీస్ మధ్య కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టీ20లో అద్భుత అర్ధ శతకంతో దుమ్మురేపాడు. కేవలంఓ 31 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. ఆరంభంలో జట్టు పరిస్థితులకు తగ్గట్లు నెమ్మదిగా ఆడిన సూర్య.. స్లాగ్ ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. సిక్సర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ డిఫరెంట్ సెలెబ్రేషన్స్‌తో అభిమానులను అలరించాడు. డ్రేక్స్ వేసిన 19వ ఓవర్‌లో సూర్య భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డగౌట్‌లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర ఆటగాళ్లు నిలబడి చప్పట్లు కొడుతూ సూర్యను అభినందించారు.
93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లతో, 2 సిక్స్‌లతో 35) కలిసి సూర్య.. 37 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో అతన్ని ఇన్నింగ్స్‌ను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఇది గమనించిన సూర్య.. సింపుల్‌గా దండం పెడుతూ తన హాఫ్ సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సూర్య దండం సెలెబ్రేషన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరి సూర్య దండంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
pic.twitter.com/UNUfkV8G1Z
— Sports Hustle (@SportsHustle3) February 20, 2022