రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను మెచ్చుకుంటూ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. నెటిజన్లు ఈ ట్వీట్‌పై ఫైర్ అయ్యారు. ఆ ట్వీట్ డిలీట్ చేయాల్సిందేనంటూ పట్టుపట్టారు. చివరికి తాను చేసిన ట్వీట్‌పై సూర్యకుమార్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ బౌండరీల వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పటికీ కాస్త నోటి దురుసు ప్రదర్శించాడు. తన తోటి ప్లేయర్ దేవదత్ పడిక్కల్ మీద సీరియస్ అయ్యాడు. వెంటనే బాల్ అందుకుని వేయ్ అంటూ సీరియస్ గా రియాన్ రియాక్ట్ అయ్యాడు. ఓ పక్క ఈ విషయమై నెటిజన్లు అతని మీద మండిపడుతుంటే.. మరో పక్క సూర్యకుమార్ యాదవ్.. రియాన్ పరాగ్‌ను పొగడడమేంటో అర్థం కాలేదంటూ నెటిజన్లు తీవ్రంగా సీరియస్ అయ్యారు.
ఇక ఈ ట్వీట్ వైరల్ అవడంతో సూర్య మరో ట్వీట్ చేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూశాడు. ‘కేవలం అతని ఫీల్డింగ్ కోసమే ఆ ట్వీట్ పెట్టా గాయ్స్.. కాస్త చిల్ అవ్వండి’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఆటిట్యూడ్ పై సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. ’అమేజింగ్ ఆటిట్యూడ్ ఆన్ ది ఫీల్డ్ #riyanparag #RRvGT” అని పేర్కొన్నాడు. పరాగ్ నిజంగానే అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. రెండు సార్లు బౌండరీ వద్ద డైవ్ చేసి ఫోర్లు పోకుండా కాపాడాడు. అతని ఫీల్డింగ్ పట్ల నిజంగానే కామెంటేటర్లు, సహచరుల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ అతను ఫీల్డింగ్ చేసి కూల్‌గా ఉంటే అయిపోయేది. కానీ కాస్త ఓవరాక్షన్ చేశాడు. తాను ఆపిన బంతిని వెంటనే అందుకుని త్రో వేయాలంటూ సహచర క్రికెటర్ల మీదికి రియాన్ సీరియస్ అవ్వడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.
గుజరాత్ ఛేజింగ్ చేస్తున్న టైంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన 16వ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ వైడ్ లాంగ్ ఆన్ వైపు ఓ షాట్ ఆడాడు. ఇక లాంగ్ ఆన్‌లో ఉన్న పరాగ్ అత్యంత వేగంగా పరిగెత్తి స్లిడ్ చేసి బంతిని బౌండరీకి చేరకుండా ఆపాడు. ఇక ఆ బంతిని చేత్తో పట్టుకుంటే బౌండరీకి టచ్ అవుతానేమోనని వెంటనే బాల్ డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకొస్తున్న దేవదత్ పడిక్కల్ వైపు విసిరేశాడు. అతను విసిరేసిన టైంలో ఓ రకంగా ప్రవర్తించాడు. ఏంటలా పెళ్లికి వెళ్తున్నవాడిలా మెల్లగా వస్తావ్.. త్వరగా బాల్ అందుకుని త్రో వేయి అన్నట్లు కోపంగా ప్రవర్తించాడు. వెంటనే దేవదత్ బాల్ అందుకుని కీపర్ వైపు త్రో వేశాడు. ఫలితంగా రెండు రన్స్ సేవ్ అయ్యాయి. కానీ పరాగ్ మాత్రం తనకు కాస్త సీనియర్ అయిన తోటి సహచరుడి పట్ల అలా దురుసుగా ప్రవర్తించడం అభిమానులకు కోపం తెప్పించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియాలో గందరగోళం! రోహిత్ చుట్టూ కొత్త సమస్య!
For his fielding last night guys Chill 😁 https://t.co/GrLG67RWGd
— Surya Kumar Yadav (@surya_14kumar) May 25, 2022