టీమిండియా నయా సంచలనం, ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లపై సూర్యప్రతాపం చూపించాడు. ఆదివారం కివీస్ తో జరిగిన రెండో టీ-20లో సూర్యకుమార్ సెంచరీతో వీరవిహారం చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడుతూ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందును అందుకున్నాడు. మొత్తంగా 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో, న్యూజిలాండ్ కి భారత్.. 191 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం మౌంట్ మాంగనుయ్ లో రెండో మ్యాచ్ జరుగుతుంది.
న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగనుయ్ లో జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓపెనర్ గా 31 బంతుల్లో 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ రిషబ్ పంత్ మాత్రం 13 బంతులు ఆడి కేవలం ఆరు పరుగులే చేసి నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. 6.4 ఓవర్లలో భారత్ 50/1 స్కోరు ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆట కొద్ది సమయం పాటు నిలిచిపోయింది. తిరిగి మొదలైన తర్వాత సూర్యకుమార్ చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఎవర్ని వదలకుండా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా సూర్య 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 51 పంతుల్లో 111 పరుగులు చేశాడు.
కాగా, చివరి ఓవర్లో పాండ్యా, దీపక్ హుడా, సుందర్ లను ఔట్ చేసిన టిమ్ సౌథీ హ్యాట్రిక్ సాధించాడు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్.. ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఇటీవలే ముగిసిన టీ-20 ప్రపంచ కప్ లో టీమిండియా తరపును పరుగుల వరద పారించిన సూర్య కుమార్..న్యూజిలాండ్ గడ్డపై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఇక ఇక్కడ సూర్య కుమార్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై ఓ టిమిండియా బ్యాటర్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అతడి టీ-20 కెరీర్ లో ఇది రెండో సెంచరీ కాగా.. ఒకే క్యాలెండర్ ఇయర్ రెండు సెంచరీలు చేసిన రెండో టీమిండియా బ్యాటర్ గా సూర్య కుమార్ నిలిచాడు. ఇతడి కంటే ముందు ఈ ఘనతను హిట్ మ్యాన్ రోహిత్ అందుకున్నాడు.
#INDvsNZ #suryakumar pic.twitter.com/k2Xhp0CSVk
— naashonomics (@naashonomics) November 20, 2022