టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కు కారు ప్రమాదం అన్న వార్తతో క్రీడా ప్రపంచం మెుత్తం దిగ్భ్రాంతి చెందింది. తన తల్లితో కలిసి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పంత్ తన స్వస్థలానికి బయలుదేరాడు. ఈ విషయం పంత్ కుటుంబ సభ్యులకు కూడా తెలీదు. రూర్కీ సమీపానికి వచ్చిన పంత్ కారు ఒక్కసారిగా అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం కాగ.. పంత్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. గయపడ్డ పంత్ ను స్థానికులు, పోలీసులు దగ్గరల్లోని ఆస్పత్రికి తరలించారు. పంత్ ప్రమాదంపై ట్విటర్ వేదికగా చాలా మంది క్రికెటర్లు స్పందించారు. ఇక టీమిండియా 360 ప్లేయర్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం సూర్య చేసిన ట్విట్ వైరల్ గా మారింది.
రిషబ్ పంత్.. టీమిండియా క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పంత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం తెల్లవారుజామున పంత్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో ఈ వార్త తెలిసిన క్రీడా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఈ ప్రమాదంపై ఇప్పటికే చాలా మంది టీమిండియా ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా పంత్ స్పీడ్ గా కోలుకోవాలని ప్రార్థించారు. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రమాదంపై ట్విటర్ వేదికగా ఎమోషనల్ గా స్పందించాడు. అయితే పంత్ కు సూర్య కుమార్ కు మంచి అనుబంధం ఉంది. అది మనకు మ్యాచ్ ల్లో సైతం కనిపించింది. దాంతో తన ప్రియమైన స్నేహితుడికి ఇలా జరగడంతో షాక్ కు గురైయ్యాడు. ” నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను.. నువ్వు త్వరగా కోలుకుని తిరిగి రావాలి ఛాంపియన్” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం సూర్య కుమార్ రంజీల్లో దుమ్మురేపుతున్నాడు. ఆడిన తొలి టెస్ట్ లోనే డాషింగ్ ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.
Praying for you, my brother. Get well soon champ❤️
— Surya Kumar Yadav (@surya_14kumar) December 30, 2022