ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సీజన్లో రెండు కొత్త ఫ్రాంచైజీల ఎంట్రీతో మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది. అయితే పాయింట్స్ టేబుల్ చూసుకుంటే.. సీఎస్కే పరిస్థితి ఎంతో దారుణంగా ఉందనే చెప్పాలి. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది.. ఈసారి ఐపీఎల్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. చాలా జట్లు తమ ఆస్థాన ప్లేయర్లను వదులుకున్నాయి. చాలా మంది వేలంలో అమ్ముడైనా కూడా.. ఐపీఎల్ స్టార్ ప్లేయర్, సీఎస్కే చిన్న తలా మాత్రం అమ్ముడవ్వలేదు.
ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన ధోని! తొలి భారత క్రికెటర్..
సురేశ్ రైనా ఈ ఐపీఎల్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది రైనాను చెన్నై తీసుకోవాల్సిందని తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. సరే వేలంలోనైనా వేరొక టీమ్ తీసుకుంటుందని చూస్తే.. ఎవరూ తీసుకోలేదు. చెన్నై జట్టు వద్దనుకున్నా కూడా.. రైనా మాత్రం జట్టును వద్దనుకోలేదు. సీజన్ మొదలైన తర్వాత చెన్నైకే తన సపోర్ట్ అంటూ రైనా అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇప్పుడు చెన్నై అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. చిన్న తలా అన్ని ఫార్మట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.అంతర్జాతీయ క్రికెట్ కు సురేశ్ రైనా 2020లో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే తాను కూడా వీడ్కోలు పలకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే తర్వాత ఐపీఎల్ లో కొనసాగుతూ వచ్చాడు. కానీ, ఈ సీజన్ లో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ప్రస్తుతం రైనా 35లోకి వచ్చేశాడు. వచ్చే సీజన్లో కూడా వేలంలో అమ్ముడవుతాడనే నమ్మకం లేదు. ప్రస్తుతం కామెంటేటర్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇంక దానిలోనే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రిటైర్మెంట్ పై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాడని సమాచారం. రైనా తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.