మిస్టర్ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా.. ఐపీఎల్‌లో కొనసాగాడు. కానీ.. ఐపీఎల్ 2022 సీజన్‌లో రైనాను చెన్నై సూపర్ కింగ్స్ రిటేన్ చేసుకోలేదు. కనీసం వేలంలో అయినా కొనుగోలు చేస్తుందని భావించినా అదీ జరగలేదు. దీంతో ఐపీఎల్ 2022లో రైనా బరిలోకి దిగలేదు. ఉత్తర ప్రదేశ్ స్టేట్ టీమ్‌కు ఆడుతున్న రైనా.. తాజాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు, ఐపీఎల్‌కు సైతం గుడ్‌బై చెప్పాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇప్పటికే మంచి టాలెంటెడ్ యువ క్రికెటర్లు ఉన్నారని.. యువకులకు అవకాశం ఇవ్వడం కోసం తాను దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ బోర్డుతో పాటు బీసీసీఐకి వెల్లడించినట్లు రైనా ప్రకటించాడు. తన నిర్ణయాన్ని రెండు బోర్డులు అంగీకరించాయని, అందుకు వారికి ధన్యవాదాలు తెలిపాడు.
కాగా.. మరో రెండు, మూడేళ్ల పాటు క్రికెట్ ఆడాలనుకుంటున్న రైనా అందుకోసం అంతర్జాతీయంగా జరిగే టీ20 లీగ్స్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. దీని కోసం బీసీసీఐ, ఉత్తర్ ప్రదేశ్ బోర్డుల నుంచి నో అబ్జెక‌్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే తనను యూఏఈ, సౌతాఫ్రికా, శ్రీలంక టీ20 లీగ్స్ నుంచి సంప్రదించారని.. మరి కొన్ని రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. కాగా.. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న రోడ్ సెఫ్టీ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్నట్లు రైనా తెలిపాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన రైనా త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ, సౌతాఫ్రికా టీ20 లీగ్స్‌లో ఆడుతాడనే విషయం స్పష్టమైంది. త్వరలో ఈ లీగ్స్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం కూడా నిర్వహించనున్నారు.
విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లకు అనుమతి లేకున్నా.. దేశంలోని ఏ క్రికెట్ బోర్డుతోనూ సంబంధం లేకుంటే మాత్రం విదేశీ లీగ్స్‌లో ఆడొచ్చు. అందుకే రైనా ఉత్తర్ ప్రదేశ్, బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నాడు. కాగా.. ఇప్పటి వరకు 205 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన కెరీర్‌లో రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు, ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు అలాగే 78 అంతర్జాతీయ టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రైనా పేరిట అరుదైన రికార్డు ఉంది. మరి మిస్టర్ ఐపీఎల్ రైనా.. ఐపీఎల్‌ను కాదని విదేశీ లీగ్స్ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ధోని విషయంలో విరాట్ కోహ్లీ చెప్పిందంతా అబద్ధం: బీసీసీఐ అధికారి
Suresh Raina will be playing for India Legends in Road Safety World Series and He is alos in talks with T20 franchises in South Africa, Sri Lanka and UAE to play in the coming seasons. #SureshRaina • #Raina • #retirement • #mripl pic.twitter.com/yIeBlfeK6P
— sureshraina3_adicts (@Sureshraina3A) September 6, 2022
Growing each day in my happy place 🏏❤️ pic.twitter.com/wJqOu1qWq8
— Suresh Raina🇮🇳 (@ImRaina) September 5, 2022
It has been an absolute honour to represent my country & state UP. I would like to announce my retirement from all formats of Cricket. I would like to thank @BCCI, @UPCACricket, @ChennaiIPL, @ShuklaRajiv sir & all my fans for their support and unwavering faith in my abilities 🇮🇳
— Suresh Raina🇮🇳 (@ImRaina) September 6, 2022