మిస్టర్ ఐపీఎల్, టీ20 స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న టీమిండియా స్టార్ ప్లేయర్ సురేస్ రైనా ఐపీఎల్ 2022 వేలంలో మాత్రం అవమానం ఎదుర్కొన్నాడు. వేలంలో రైనాను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో రైనాతో పాటు అతని ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ చెందారు. టీ20 స్పెషలిస్టును మళ్లీ చూడలేమా అనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఎలాగైనా రైనా ఐపీఎల్‌లో వచ్చేలా చేయాలంటూ అతని ఫ్యాన్స్ ప్రార్థనలు కూడా చేశారు. వారి ప్రార్థనల ఫలించాయో ఏమో కానీ.. రైనా మళ్లీ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటి వరకు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన రైనా.. మధ్యలో రెండు ఏళ్లు గుజరాగ్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో రైనా కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడే అవకాశం ఉంది.
జాసన్ రాయ్ స్థానంలో రైనా..
ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌ను వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటివల జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో రాయ్ బాగానే రాణించాడు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో క్రికెటర్లు బయో బబుల్‌లో గడపాల్సి వస్తుంది. దీంతో నెలలకు నెలలు కుటుంబంతో దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పీఎస్‌ఎల్ ముగిసి మళ్లీ ఐపీఎల్ కోసం నెలన్నర రోజులు బయోబబుల్‌లో ఉండాల్సి వస్తుంది రాయ్‌కి. ఈ నేపథ్యంలో కుటుంబంతో సమయం గడిపేందుకు రాయ్.. ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు తెలియజేశాడు. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా రాయ్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో రాయ్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకునే వెసులు బాటు గుజరాత్‌కు ఉంది. టీ20 స్పెషలిస్టు, ఇండియన్ ప్లేయర్ అయినా రైనాను రాయ్‌స్థానంలో గుజరాత్ టైటాన్స్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
Jason Roy 🔄 Suresh Raina. Possible ?#GujaratTitans pic.twitter.com/aHj0P9PiFl
— Dr. Cric Point (@drcricpoint) March 1, 2022
గుజరాత్ టైటాన్స్ కోచ్, కెప్టెన్ ఓటు రైనాకే..
గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్థిక్ పాండ్యా కూడా రైనాను జట్టులోకి తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైనా, నెహ్రా టీమిండియాకు కలిసి ఆడాడు. రైనా సామర్థ్యంపై నెహ్రాకు గట్టి నమ్మకం ఉంది. నిజానికి రైనాను వేలంలో తీసుకోనేందుకు నెహ్రా ఆసక్తి చూపినట్లు సమాచారం. కానీ ఇతర సభ్యుల నిర్ణయాలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కానీ అనుకోకుండా రాయ్ జట్టుకు దూరం అవ్వడంతో రైనాను ఎలాగైన జట్టులోకి తీసుకోచ్చేందుకు నెహ్రా ప్లాన్‌చేస్తున్నట్లు తెలుస్తుంది. నెహ్రాకు రైనా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే రైనాతో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం.
రైనా రాకతో మిడిల్డార్ పటిష్టం..
మిస్టర్ ఐపీఎల్ రైనా గుజరాత్ టైటాన్స్‌తో చేరితే.. ఆ జట్లుకు మిడిల్డార్‌లో కొండంత అండ వచ్చినట్లే. చెన్నై నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిందంటే.. అందులో రైనా పాత్ర ఎంతో ఉంది. ఆ జట్టుకు వన్ డౌన్, లేదా మిడిల్డార్‌లో వెన్నుముకలా ఉండే వాడు రైనా. ఇప్పడు గుజరాత్ టైటాన్స్‌లో కూడా రైనా అలాంటి కీలక పాత్ర పోషించనున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే రైనా ఐపీఎల్ 2022లో గ్రౌండ్‌లోకి దిగే అవకాశం ఉంది. మరి రైనా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.