టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా బ్యాటింగ్‌లో చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో బౌలర్లను ఊచకోత కోశాడు. ఐపీఎల్లో కూడా చూడని విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు.
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రౌండ్లోకి దిగాడంటే ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను చితగ్గొట్టడంలో అతడు దిట్ట. మరోసారి తన హిట్టింగ్ ఎలా ఉంటుందో చూపించాడు రైనా. ఘజియాబాద్ వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో బుధవారం ఇండోర్ నైట్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్లు తలపడ్డాయి. ఇండోర్ నైట్స్ 11 రన్స్ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండోర్ నైట్స్.. ఫిల్ మస్టర్డ్ (39 బాల్స్‌లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బాల్స్‌లో 90 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది. ఇండోర్ టీమ్ బ్యాటింగ్‌లో రైనా ఇన్నింగ్స్ స్పెషల్ అనే చెప్పాలి. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలించాడు రైనా.
ఇక, నింజాస్ టీమ్ బౌలర్లలో కుల్దీప్ హుడా 4 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ 2 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన నింజాస్‌ను కుల్దీప్ హుడా (42 బాల్స్‌లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి నింజాస్ 7 వికెట్ల నష్టానికి 198 రన్స్‌కు పరిమితమైంది. దీంతో ఆ జట్టు 11 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. కాగా, ఈ టోర్నమెంట్లో దేశీ ప్లేయర్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్లు వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో టోర్నీకి క్రేజ్ పెరిగింది.
Suresh scored unbeaten 90 Runs from 45 balls including 10 fours & 4 Sixes😍
What a fabulous innings it was🫶🏻You won my heart once again Love @ImRaina ❤️#SureshRaina pic.twitter.com/POGsQDhuL3
— Rohan Jha🔰 (@ImRohanJha3) March 22, 2023