ప్రస్తుతం భారత క్రికెటర్లు ఉన్న ఫామ్ చూస్తుంటే.. టీమిండియా కాస్త గాడిలో పడినట్లు అనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లు సైతం దుమ్మురేపుతున్నాడు. కొంత కాలం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వని రోహిత్ శర్మ సైతం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ కూడా భీకరఫామ్‌లో ఉన్నాడు. వీరికి తోడు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సంచలన ఫామ్‌తో సెంచరీలతో మాట్లాడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. బౌలింగ్‌లో సిరాజ్, షమీ, ఉమ్రాన్ మాలిక్ త్రయం అదరగొడుతోంది. ఇప్పటికే సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు వన్డేల్లో.. ఇవన్నీ చూస్తుంటే.. ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్‌పై భారత క్రికెట్ అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
అయితే.. ఇప్పుడున్న మరో మెరుపు యాడ్ అవ్వలంటే.. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్‌లోనూ తన సత్తా చాటాల్సి ఉంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో కూడా రాణిస్తే.. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం భారత్ ఒక భీకరమైన జట్టుతో వెళ్లొచ్చు. ఇదే ఆలోచనతో సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే క్రికెట్‌లో భారీగా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి ప్రదర్శన ఇవ్వలేదు. కొన్ని సార్లు అతని బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయినా కూడా సూర్యను ఎలాగైన వన్డే వరల్డ్ కప్‌లో ఒక తురుపు మొక్కలా వాడుకోవాలని భావిస్తున్న కారణంగా.. సూర్యను టెస్టు టీమ్‌లోకి కూడా తీసుకున్నారు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత.. ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టు సిరీస్ కోసం.. బీసీసీఐ ఇప్పటికే తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. ఈ స్క్వౌడ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో ఏ ఒక్క టెస్టు ఆడే అవకాశం సూర్యకు వచ్చినా.. మూడు ఫార్మాట్లు ఆడిన ప్లేయర్‌గా నిలుస్తాడు. అయితే.. సూర్యకుమార్‌కు వన్డే, టెస్టుల్లో అవకాశాలు ఇవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్‌కు టెస్టుల్లో అవకాశం ఇవ్వడం మంచి విషయం అన్నాడు. అతను లేకుంటే.. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ లేనట్లేనని అన్నాడు. సూర్యను మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలని.. అతని బ్యాటింగ్ స్టైల్, ఆడే షాట్లు తనకెంతో ఇష్టమని రైనా పేర్కొన్నాడు. సూర్య తన బ్యాటింగ్‌తో గ్రౌండ్ కొలతలను తనకు నచ్చినట్లు మార్చేసుకుంటాడని అంటున్నాడు. మరి రైనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘Without him, all three formats should not even exist’ – Suresh Raina, Pragyan Ojha back Suryakumar Yadav’s Test inclusion https://t.co/bJInjaTiXv pic.twitter.com/FTPSKQHKwW
— CrickTale Official (@CricktaleO) January 25, 2023