ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటూ నిదానంగా కోలుకుంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో పలువురు భారత మాజీ ఆటగాళ్లు పంత్ ని పలకరించడానికి వస్తున్నారు. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లు పంత్ ను పరామర్శించారు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ డిసెంబర్ 30, 2022 న ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. అయితే పంత్ అప్పటికప్పుడు తేరుకోవడంతో అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటూ నిదానంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు భారత మాజీ ఆటగాళ్లు పంత్ ని పలకరించడానికి వస్తున్నారు. ఇప్పటికే యువరాజ్ సింగ్ ఈ యువ వికెట్ కీపర్ ను కలవగా.. తాజాగా టీమిండియా మాజీ ఆటగాళ్లు అయిన హర్భజన్ సింగ్, సురేష్ రైనా, శ్రీశాంత్ లు పంత్ ని కలిసి సర్ప్రైజ్ చేశారు.
రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే పంత్ తనకు అయిన గాయం గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూనే వున్నాడు. ఇటీవలే ఈ భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ స్విమ్మింగ్ పూల్లో నిలబడిన ఫోటో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత యువరాజ్ సింగ్ కలిసి “ఛాంపియన్ ఒక రోజు మళ్ళీ రైజ్ అవుతాడు. ఎప్పుడూ నవ్వుతూ.. చాలా పాజిటీవ్ గా కనిపిస్తాడు” అల్ ది బెస్ట్ రిషబ్ అని ట్వీట్ చేసాడు. ఇక తాజాగా.. రైనా, హర్భజన్, శ్రీశాంత్ కూడా పంత్ ను కలిసి కాసేపు సందడి చేశారు. ఈ ఫోటో చూస్తుంటే పంత్ కుడి కాలి మోకాలికి బ్యాండేజ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇరువైపులా రైనా, హర్భజన్ ఉండగా వెనుకనుంచి శ్రీశాంత్ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. గాయంతో ఇబ్బందిపడుతున్న పంత్ మాత్రం నవ్వుతూ.. చాలా ఆనందంగా కనిపించడం విశేషం.
ఈ సందర్భంగా రైనా ట్వీట్ చేస్తూ.. “నా సోదరుడు నా ఫ్యామిలీలో ఒక భాగం. నువ్వు చాలా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను”అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీశాంత్, హర్భజన్ కూడా పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. పంత్ రోడ్ యాక్సిడెంట్ కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ తో పాటుగా.. డబ్ల్యూటీసీ ఫైనల్ కి దూరం కానున్నాడు. అయితే పంత్ కోలుకొని వరల్డ్ కప్ సమయానికి అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి గాయమైన పంత్ మాత్రం సోషల్ మీడియాలో నవ్వుతూ చేసే సందడి మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Suresh Raina, Harbhajan Singh & Sreesanth met Rishabh Pant who is recovering from Road accident injuries! 👍
.
.
.#sureshraina #raina #rishabhpant #pant #harbhajansingh #harbhajan #bhajji #indiancricket #teamindia pic.twitter.com/u4xGqPjDDU— Cricket Universe (@CricUniverse) March 26, 2023