ఐపీఎల్ 2022 టైటిల్ సాధనే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కెప్టెన్ విలియమ్సన్, యువ ఆటగాళ్లు మాలిక్, సమద్‌ను రిటైన్ చేసుకున్న SRH.. వార్నర్, బెయిర్‌స్టో లాంటి మ్యాచ్ విన్నర్లను సైతం పక్కన పెట్టేసింది. దీంతో మెగా వేలంలో కీలకమైన ఓపెనింగ్ స్థానంపై గురిపెట్టనుంది. అందుకోసం ఇప్పటి నుంచే వ్య్వూహాలు రచిస్తుంది.
వార్నర్ లాంటి ఆటగాడ్ని వదులుకున్న SRH.. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు పెద్ద ప్లానే వేసింది. ముంబై రిటైన్ చేసుకుని హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్‌పై SRH కన్నేసింది. ఈ టీ20 స్పెషలిస్ట్‌ను ఎలాగైనా జట్టులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏ జట్టుకైనా ఓపెనర్లు చాలా కీలకం. అందుకే అన్ని జట్లు తమ ఓపెనింగ్ జోడీపై ప్రత్యేక దృష్టి పెడ్తాయి. అందుకే SRH కూడా దూకుడైన ఓపెనింగ్ జోడిని సిద్ధం చేసేందుకు రెడీ అయింది.
ఈ క్రమంలో ముంబై తరపున కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్‌గా అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసి వార్నర్, బెయిర్‌స్టో లేని లోటు భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మిడిల్డార్‌లో విలియమ్సన్ లాంటి సీనియర్ ఉన్నాడు. చివర్లో సమద్ లాంటి యంగ్ గన్ ఉన్నాడు.. ఇక ఓపెనింగ్‌లో ఇషాన్ లాంటి స్టార్ ప్లేయర్ ఉండడం SRH కలిసొచ్చే అంశమే. మరి ఇషాన్ కిషాన్ SRHలోకి వస్తే ఎలా ఉంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయం