ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలం అయిన సన్‌రైజర్స్ టీమ్‌ను ప్రక్షాళన చేసేందుకు ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆ జట్టు హెడ్ కోచ్ టామ్ మూడీకి SRH గుడ్‌బై చెప్పింది. టామ్ మూడీని హెడ్‌కోచ్‌గా తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలన ప్రకటన చేసింది. టామ్ మూడీ కాంట్రాక్ట్‌ను పొడిగించకూడదని కావ్య మారన్ నిర్ణయించారు. కాగా.. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. టామ్ మూడీ సైతం సన్‌రైజర్స్ కోచ్‌గా కొనసాగేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.
గతంతో రెండు సార్లు టామ్ మూడీ కాంట్రాక్ట్‌ను పొడిగించిన SRH.. మూడో సారి మాత్రం అలా చేయలేదు. ఇక టామ్ మూడీ స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారాను SRH హెడ్ కోచ్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు మెంటర్ కమ్ బ్యాటింగ్ కోచ్‌గా లారా పనిచేశారు. ఇప్పుడు హెడ్ కోచ్ బాధ్యతలు ఆయనకే అప్పగించాలని కావ్య మారన్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ తొమ్మిది సీజన్ల పాటు కోచ్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలో 5 సార్లు SRH ప్లేఆఫ్స్‌కు చేరింది. వార్నర్ కెప్టెన్సీలో 2016లో టైటిల్‌ను కూడా గెలుచుకుంది. మరి సన్‌రైజర్స్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పాక్‌పై తేలిపోయిన హాంకాంగ్! టీమిండియా బౌలర్లపై తీవ్ర విమర్శలు
Sunrisers Hyderabad part ways with Tom Moody in IPL. (Source – Espn Cricinfo)
— Johns. (@CricCrazyJohns) September 2, 2022
Tom Moody and SRH association has comes to an end. (Espn) pic.twitter.com/DMLrim2n3T
— Dr. Cric Point 🏏 (@drcricpoint) September 2, 2022