సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్ కేన్ విలియమన్స్ ని వదిలేసుకుంది. తాజాగా జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ప్రతి జట్టు కూడా కొందరు విలువైన ఆటగాళ్లని విడిచిపెట్టాయి. అందులో భాగంగానే కేన్ మామని వదిలేసినట్లు తెలుస్తోంది. మరి కెప్టెన్ నే బయటకు పంపించేశారు. ఆ బాధ్యతల్లోకి వచ్చే కొత్త ఆటగాడు ఎవరు అనే సందేహాం అభిమానులకు ఇప్పుడు మొదలైంది. అందులో భాగంగా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఏ పేరు మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. దీనితో పాటే సన్ రైజర్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంది అనేది కూడా ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వచ్చే ఐపీఎల్ కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. అందులో భాగంగానే సన్ రైజర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ విలియమ్సన్ తో పాటు నికోలస్ పూరన్, షెపర్డ్ ని వదిలేసుకుంది. కేవలం 12 మంది ఆటగాళ్లని మాత్రం రిటైన్ చేసుకుంది. వారిలో మార్కర్రమ్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమాద్, ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్లా ఫరూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లు ఉన్నారు. అయితే వీరిలో అనుభవం పరంగా చూసుకుంటే భువీ మాత్రమే సీనియర్ ప్లేయర్. కాబట్టి అతడికే కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే విలియమన్స్ ని రిలీజ్ చేసిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్.. ‘కేన్ మామ ఎప్పటికీ మనవాడే’ అని క్యాప్షన్ తో ఫొటో పోస్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే.. త్వరలో జరగబోయే వేలంలో విలియమన్స్ ని తిరిగి తక్కువ ధరకు కొనేయాలని ప్లాన్ వేశారా అనిపిస్తోంది. మరోవైపు తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా అద్భుతమైన ఆటతీరుతో మెప్పించాడు. ఇప్పుడు అతడిపై కూడా సన్ రైజర్స్ కన్నేసిందా అని డౌట్ వస్తుంది. ఈసారి జరగబోయే మినీ వేలంలో ఏమేం అద్భుతాలు జరుగుతాయనేది చూడాలి. మరి విలియమ్సని వదిలేయడం, భువీకి కెప్టెన్సీ అప్పగిస్తారనే వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Bhuvi to be the next #SRH captain?
— Aakash Chopra (@cricketaakash) November 15, 2022
Always our Kane Mama! 🧡#SunRisersHyderabad #OrangeArmy pic.twitter.com/UkieccM3yP
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022