మూడు రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం బెంగుళూరు వేదికగా జరగనుంది. ఈ నెల 12, 13న 590 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటారు. వీరికోసం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ జెర్సీ మార్చుకోనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్‌లో ఉన్న SRH జెర్సీ ఏ కలర్‌లో ఏ స్టైల్‌లో రానుందో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ SRH జెర్సీ మార్చుకోవడానికి కారణం మాత్రం వెల్లడించలేదు.
Kotha season, kotha jersey mawas. 🔥🧡#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/8xcj5tOQPb
— SunRisers Hyderabad (@SunRisers) February 9, 2022
సాధారణంగా అన్ని జట్లు తమ జెర్సీల్లో మార్పులు చేసుకుంటూ.. ప్రతి సీజన్‌లో కొత్తదనం కనిపించేలా చూసుకుంటాయి. తాజాగా SRH కూడా తన జెర్సీలో కొన్ని మార్పులు చేస్తుందా? లేక కొత్త రంగులో జెర్సీని తెస్తుందా? అనే విషయం తెలియదు. రెండు కొత్త జట్లు వస్తున్న క్రమంలో జెర్సీ కొత్తదనంతో ఉండాలిన కూడా SRH మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుధవారం సాయంత్రం 5.30 నిమిషాలకు SRH కొత్త జెర్సీని విడుదల చేయనుంది. మరి SRH కొత్త జెర్సీ తేవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.