ఐపీఎల్ 2022 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమితో ప్రారంభించింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చెత్త బౌలింగ్, ఫేలవ బ్యాటింగ్‌తో.. ఐపీఎల్‌కి ముందు జట్టు సరిగా లేదనే ఆరోపణలను నిజం చేస్తూ.. దారుణ ఓటమిని ముటగట్టుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH.. తొలి ఓవర్‌లోనే తమ నిర్ణయం సరైందే అనే విధంగా కనిపించింది. SRH స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లో నిప్పులు చెరిగాడు. అవుట్ స్విగర్లు, ఇన్ సింగర్‌తో రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను ఇబ్బంది పెట్టాడు. ఐదో బంతికి స్లిప్‌లో సమద్‌కు క్యాచ్ ఇచ్చాడు బట్లర్.. రాయల్స్ సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కానీ.. SRH దురదృష్టం కొద్ది అదికాస్త నో బాల్ అయింది. దీంతో అవుట్ నుంచి బతికిపోయిన బట్లర్ తర్వాత.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
తొలి ఓవర్‌లో కేవలం ఒక్కపరుగే వచ్చినా.. 5 ఓవర్లకు 52 పరుగులు చేసింది రాయల్స్ టీమ్. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్ మొత్తం రాజస్థాన్ బ్యాటర్ల హవా సాగింది. కెప్టెన్ సంజూ శాంసన్ అర్ధ సెంచరీకి తోడు, దేవదత్త్ పడిక్కల్ చెలరేగడంతో.. నిర్ణీత 20 ఓవర్లకు 210 పరుగుల భారీ సాధించింది. కొండంత లక్ష్యఛేదనకు దిగిన SRH.. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలం అయింది. కెప్టెన్ విలియమ్సన్(2), ఓపెనర్ అభిశేక్ శర్మ 9, రాహుల్ త్రిపాఠి 0, కోట్లు పెట్టి కొన్న నికోలస్ పూరన్ 0, అబ్దుల్ సమద్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మార్కరమ్ 57, వాషింగ్టన్ సుందర్ 40 పరుగులతో కనీసం ఆ మాత్రం పోటీ అయినా ఇవ్వగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో SRH 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసి.. 61 పరుగుల తేడాతో ఓడింది.ఛేజింగ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన SRH..
ఐపీఎల్ 2022లో ఇప్పటి తొలుత జరిగిన నాలుగు మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన టీమ్స్ విజయం సాధించాయి. మంగళవారం ఐదో మ్యాచ్‌లో SRH టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో గెలుపు ఖాయం అని SRH ఫ్యాన్స్ భావించారు. రాజస్థాన్ రాయల్స్ 200 పైచిలుకు పరుగుల భారీ స్కోర్ చేసినా.. బ్యాటింగ్ కదా.. SRHఏ గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఐపీఎల్ 2022 పరంపరను బ్రేక్ చేసి.. కనీసం పోటీ ఇవ్వకుండా చేతులెత్తేసింది.
పూరన్‌పై మీమర్స్ ఫైర్..
నికోలస్ పూరన్.. వేలంలో SRH భారీ ధరపెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్. కానీ మ్యాచ్‌లో డకౌట్ అయి SRH మేనేజ్‌మెంట్ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. నిజానికి పూరన్ కొనుగోలుపై వేలం ముగిసిన తర్వాత వెంటనే విమర్శలు వచ్చాయి. అతన్ని అనవసరంగా అంత ధర పెట్టి కొన్నారంటూ SRH ఫ్యాన్స్ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే పూరన్ డకౌట్ అవ్వడంతో మరోసారి SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. వీరికి తోడు మీమర్స్ కూడా పూరన్‌పై విరుచుకుపడ్డారు. ‘నిన్ను ఇంత ధరపెట్టి కొన్నది ఇందుకే నా అయ్యా’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి SRH ప్రదర్శనపై, పూరన్‌పై వస్తున్న ట్రోల్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఎవరీ బదోని? గంభీర్ తో అతని రిలేషన్ ఏమిటంటే?
Nicholas Pooran’s
Last 7 IPL Innings In India
0, 0, 9, 0, 19, 0, 0
— 👑G.B Abhishek🇮🇳 (@GBAbhishek18) March 29, 2022
6th IPL duck for Nicholas Pooran. #IPL fans be like:#SRHvRR #IPL pic.twitter.com/AA1hG1lxDK
— Akhib (@intr0casm) March 29, 2022
Nicholas Pooran scoring another duck in IPL. #SRHvRR pic.twitter.com/LFrDmESjQX
— ComeOn Cricket 🏏🇮🇳 (@ComeOnCricket) March 29, 2022
When the lights are brightest,
Pressure is highest,
Crowds are the loudest,
The best will arrive,
The strongest will survive,
The greatest will thrive.Nicholas Pooran ,The GOAT 💎#SRHvRR #RRvsSRH pic.twitter.com/pKdcVuZsbl
— Sami 🇮🇳 💜 (@imssami66) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.