బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు(శుక్రవారం) భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఈ టెస్టు మ్యాచ్ పుజారా కెరీర్లో 100వది. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు..
టెస్టు క్రికెట్.. ఈ ఫార్మాట్ లో ఉండే కిక్కె వేరు. టీ20ల్లో ఉండే మజా ఒక్క పూట అయితే, వన్డేల్లో ఉండే మజా ఒక్క రోజు మాత్రమే. కానీ టెస్టు క్రికెట్ అందించే వినోదం అంతా ఇంతా కాదు. 5 రోజులు జరిగే ఈ టెస్టు క్రికెట్ లో మొదటి రోజు నుండే మజా మొదలవుతుంది. పూటపూటకు ఆట చేతులు మారుతూ.. నరాలు తెగే ఉత్కంఠను అందిస్తుంది. ఇలాంటి ఫార్మాట్‌లో సాధారణంగా ఒక ఆటగాడు స్థానం సంపాదించడం చాలా కష్టం. టెస్టు క్రికెట్ ఆడిన ఆటగాళ్లను చాలా గౌరవంగా చూస్తారు. యువ ఆటగాళ్లు అప్పటికే టీ20, వన్డేల్లో అదరగొడుతున్నా.. టెస్టుల్లోకి అరంగ్రేటం చేసేటప్పుడు ఎంతో భావోద్వాగానికి లోనవుతుంటారు. అలాంటిది ఒక ప్లేయర్ 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు అంటే అతన్ని ఒక దిగ్గజంగానే పరిగణిస్తారు.
ఇప్పుడు ఆ లిస్టులోకి ఇండియన్ క్రికెట్ టీం నయా వాల్ భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చటేశ్వర్ పుజారా అడుగు పెట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు(శుక్రవారం) భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఈ టెస్టు మ్యాచ్ పుజారా కెరీర్లో 100 వది. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ తన చేతుల మీదుగా ఒక స్పెషల్ క్యాప్‌ను పుజారాకు అందించారు. ఈ వేడుకకి పుజారా సతీమణి, అలాగే పుజారా తండ్రి కూడా హాజరయ్యారు. 35 ఏళ్ల పుజారాకు ఇది 100 వ టెస్టు మ్యాచ్ కాగా.. ఓవరాల్ గా భారత్ తరపున ఈ ఘనత సాధించిన 13వ ప్లేయర్.
టెస్టు కాప్ అందించి గవాస్కర్ మాట్లాడుతూ.. ‘100 టెస్టులో నువ్వు ఎదుర్కున్న ప్రతి బంతి కూడా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. 100వ టెస్టులో భారీ సెంచరీ కొట్టిన తొలి భారత ప్లేయర్ గా నిలవాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. నీ కష్టం అందరికి ఒక రోల్ మోడల్’ అని చెప్పుకొచ్చారు. 2010లో ఆస్ట్రేలియాపై అరంగ్రేటం చేసిన పుజారా ఇప్పటివరకు 99వ టెస్టు మ్యాచుల్లో 7021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు,34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2017-18,2020-21ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, అదేవిధంగా 2021 ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించింది. ఈ రెండు సందర్భాల్లో పుజారా భారత జట్టులో సభ్యుడు. ఇది ఇలా ఉండగా భారత్,ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ లో రెండో టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా లంచ్ సమయానికి 94/3తో నిలిచింది. ఇప్పటికే భారత్ ఈ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మరి పుజారా గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“You have put your body on line for India. You have made the bowlers earn your wicket,” says Sunil Gavaskar to Cheteshwar Pujara.
📹: @BCCI #SunilGavaskar | #CheteshwarPujara | #BGT2023 pic.twitter.com/qWE5IBu134
— Cricket.com (@weRcricket) February 17, 2023