కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా కూడా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. ఎందుకంటే భారత్‌తో ఫైనల్ రేసులో పోటీ పడిన శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ ఫైనల్ చేరింది. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు న్యూజిలాండ్‌కు, కేన్ విలియమ్సన్‌కు థ్యాంక్యూలు చెప్పారు. కానీ.. అలాంటి అవసరం ఏం లేదంటున్నారు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్
సోమవారం రోజు రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. ఒకటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్టేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు అయితే.. మరొకటి న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన మొదటి టెస్టు. చాలా మంది భారత క్రికెట్ అభిమానులు ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ చూడడం మానేసి న్యూజీలాండ్-శ్రీలంక మ్యాచ్ చూడడం విశేషం. దానికి కారణం ఏంటంటే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం కివీస్ చేతిలో ఉండడమే. ఒక పక్కా అహ్మదాబాద్ టెస్టులో ఫలితం తేలేలా లేదు. టీమిండియా విజయం సాధిస్తే కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖాయం కాదు. ఆస్ట్రేలియా జట్టు కూడా డ్రా కోసమే ఆడుతున్నట్లు కనిపించడంతో.. ఎటూ ఈ మ్యాచ్‌లో ఫలితం రాదని గ్రహించి కొంత మంది భారత అభిమానులు న్యూజిలాండ్-శ్రీలంక టెస్టు మ్యాచ్ చూస్తూ న్యూజిలాండ్ కి సపోర్ట్ చేసారు. ఎందుకంటే ఈ టెస్టులో కివీస్.. లంకపై విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్తుంది. దీంతో ఎంతో ఆసక్తిగా అందరూ ఈ టెస్టు చూసారు.
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో చివరి బంతికి న్యూజిలాండ్ ని విజయం వరించింది. ఈ టెస్టు మ్యాచ్ థ్రిల్లింగ్ గా జరగడం.. అదికాక ఈ టెస్టు లో కివీస్ విజయంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్లడం ఖాయమైంది. దీంతో మనోళ్లు కివీస్ గెలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. కివీస్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. మీరు విజయం సాధించడం వల్లే భారత్ ఫైనల్ చేరిందని..సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కి ఏ మాత్రం నచ్చడం లేదు. భారత అభిమానులు న్యూజిలాండ్ కి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.
“న్యూజిలాండ్ భారత్ కి ఏమి రుణపడి లేదు. గత రెండు సంవత్సరాలుగా భారత్ అత్యున్నత్తమైన క్రికెట్ ఆడుతుంది. టాప్ 2 లో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్ళడానికి భారత్ చాలా కష్టపడింది. కివీస్ ఒక్క టెస్టులో గెలిచినంత మాత్రాన మనం ఫైనల్ కి వెళ్లామనుకుంటే పొరపాటే అవుతుంది. ఈ విజయం వారికి మంచిది కానీ మనకు కాదు. ఎవరి సహాయం లేకుండానే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరుకుంది. భారత అభిమానులు అనవసరంగా కివీస్ ని ఆకాశానికెత్తేస్తున్నారు”. అని సునీల్ గవాస్కర్ టీం ఇండియా గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. జూన్ 7-11 న లండన్ లోని ది ఓవల్ మైదానంలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసి ఫైనల్ జరగనుంది. వర్షం అంతరాయం కలిగిస్తే జూన్ 12 న రిజర్వ్ డే ఉంటుంది. మరి సునీల్ గవాస్కర్ భారత అభిమానుల గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Former Indian captain Sunil Gavaskar made an important statement as India advanced to the World Tennis Championship final. New Zealand’s two-wicket win in the first Test match guaranteed India’s spot in the championship game. #IndiavsAustraliahttps://t.co/zRns8faldH pic.twitter.com/vNb1NClOHt
— cricket live guru (@cricketliveguru) March 14, 2023