ఈ టీ20 లీగ్‌లు వచ్చిన తర్వాత క్రికెట్ వ్యాపారమైంది, క్రికెటర్లు వ్యాపార వస్తువులైపోయారనే ఒక బలమైన విమర్శ ఉంది. చాలా మంది క్రికెట్ నిపుణులు, కొంతమంది మాజీ క్రికెటర్లు సైతం ఈ మాటతో ఏకీభిస్తారు. ప్రపంచ క్రికెట్‌లో విజయవంతమైన లీగ్‌గా ఉన్న ఐపీఎల్ క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించింది. ఐపీఎల్‌ను చూపి ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కొత్తగా యూఏఈ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ అనే రెండు కొత్త లీగ్‌లు ప్రారంభం కానున్నాయి.
ఈ లీగ్‌లలో దక్కే పారితోషికానికి కొంతమంది ఆటగాళ్లు దేశం తరపున జరిగే మ్యాచ్‌లను వదిలేసి మరీ లీగ్‌లో ఆడేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ప్రాంచైజ్ క్రికెట్ హవా నడుస్తోంది. కానీ.. భారత క్రికెటర్లకు మాత్రం ఐపీఎల్ తప్పితే మరే లీగ్‌లోనూ ఆడేందుకు అనుమతి లేదు. కానీ.. మిగతా దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడతారు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఆటగాళ్లు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ క్రేజ్‌ను చూసి ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్, ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లాంటి లీగ్ నిర్వహకులు భారత క్రికెటర్లు కూడా తమ లీగ్‌లలో ఆడాలనే కోరికను బయటపెట్టాయి. ఇటివల ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ సైతం ఇండియన్ స్టార్ క్రికెటర్లు తమ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాలని, అందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వాలని కోరాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బిగ్‌బాష్, ది హండ్రెడ్ లాంటి లీగ్ నిర్వహకులు తమ లీగ్‌లలో భారత్ క్రికెటర్లు ఆడాలని కోరడం వెనుక వారి ఉద్దేశం వేరే ఉందని అన్నారు.
కేవలం స్పాన్సర్‌షిప్‌లు వస్తాయనే ఇండియన్ క్రికెటర్లను ఆహ్వానిస్తున్నారంటూ పరోక్షంగా గిల్‌క్రిస్ట్‌కు చురకలంటించాడు. టీమిండియా క్రికెటర్లకు ఉన్న క్రేజ్ దృష్ట్య పెద్దపెద్ద కంపెనీలు ఆయా లీగ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తాయి. అందుకే కొన్ని విదేశీ లీగ్‌ల నిర్వహకులు భారత క్రికెటర్లు సైతం తమ లీగ్‌లలో ఆడాలని ఆహ్వానిస్తున్నారంటూ గవాస్కర్ పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Former India captain Sunil Gavaskar said that some former foreign cricketers want BCCI to allow Indian cricketers to play in their T20 leagues to attract more sponsors. Gavaskar’s remarks came days after former Australia wicket-keeper batsman Adamhttps://t.co/NLMvrNRiA5 pic.twitter.com/XQgqWOqp0Q
— Baba Cric (@BabaCric) August 10, 2022
ఇది కూడా చదవండి: ఆ ఓటమి తర్వాత మేం నిర్ణయించుకుంది ఇదే: రోహిత్ శర్మ