'ఆస్కార్','ఆర్‌ఆర్‌ఆర్'.. ఎవరి నోట విన్నా ప్రస్తుతం ఈ రెండు పదాలు మాత్రమే వినపడుతున్నాయి. జక్కన్న తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు...' సాంగ్ అకాడమీ అవార్డును సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా దీని పైనే చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖలు, రాజకీయ నేతలు, క్రికెటర్లు ప్రతి ఒక్కరు రాజమౌళి సేనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
ప్రతి భారతీయుడు గర్వించదగిన రోజుది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం సాకారం చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకును అలరించిన ‘నాటు నాటు…’ సాంగ్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అకాడమీ అవార్డును సొంతం చేసుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తా చాటింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సినీ ప్రముఖలు, రాజకీయ నేతలు, క్రికెటర్లు ప్రతి ఒక్కరు జక్కన్న సేనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లు కూడా తమదైన శైలిలో ఆనందంతో గెంతులేశారు.
‘బోర్డర్-గవాస్కర్’ ట్రోఫీలో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ‘డ్రా’ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 3/0తో చివరి రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. ఇంకా 50 ఓవర్ల ఆట మిగిలి ఉండగా, డ్రా అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి రావడం పట్ల టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ గావాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో గావాస్కర్, ఆశిష్ రెడ్డితో కలిసి ‘నాటు నాటు…’ సాంగ్ కి స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మన తెలుగు పాట ✨
🕺🏻 నాటు నాటు 🕺🏻 కు 😎
ఆస్కార్ రావటం గర్వకారణం 😍ఈ అరుదైన సందర్భం పై 👏🏻
లెజెండ్ సునీల్ గవాస్కర్ 🤩
& స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీం సంతోషాన్ని 😉మీరు చూసేయండి 🥳
Mastercard #INDvAUS #StarSportsTelugu #TestByFire🔥 #RRR #RamCharan #SunilGavaskar #JrNTR pic.twitter.com/UVnaxilfz1
— StarSportsTelugu (@StarSportsTel) March 13, 2023