ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 జోరందుకుంది. ఇప్పటికే శ్రీలంకను నమీబియా, వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ ఓడించి సంచలనాలు నమోదు చేశాయి. దీంతో టోర్నీపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. అలాగే సోమవారం టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడిన వామప్ మ్యాచ్ సైతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ వామప్ మ్యాచ్‌ను సైతం కోట్ల మంది వీక్షించారు. దీన్ని బట్టి టీ20 వరల్డ్ కప్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆదివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించి 90 వేలకు పైగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆటగాళ్లు కూడా ఈ బిగ్ ఫైట్ కోసం సంసిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పాకిస్థాన్‌తో ఇంటర్యాక్ట్ అయ్యారు. పాకిస్థాన్ కోచ్, బ్యాటింగ్ కోచ్, కెప్టెన్ బాబర్ అజమ్‌తో పాటు ఆటగాళ్లతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా శనివారం వరల్డ్ కప్ కెప్టెన్ల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న బాబర్ అజమ్‌కు బర్త్‌డే విషెస్ తెలపడంతోపాటు ఒక అదిరిపోయే గిఫ్ట్‌ను కూడా బాబర్‌కు ఇచ్చారు సునీల్ గవాస్కర్. తమతో మాట్లాడుతున్న గవాస్కర్ వద్దకు ఎంతో వినయంగా ఒక క్యాప్ తెచ్చుకున్న బాబర్ అజమ్ దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని గవాస్కర్‌ను కోరగా.. బర్త్‌డే బాయ్ బాబర్ కోరిక మేరకు సంతకం చేసిన క్యాప్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా అందించారు. గవాస్కర్ పాక్ టీమ్‌తో ముచ్చటించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ఈ ఫార్మల్ మీటింగ్‌లో సునీల్ గవాస్కర్ బాబర్‌కు ఒక విలువైన టిప్ ఇచ్చినట్లు కూడా సమాచారం. గవాస్కర్ బాబర్‌తో మాట్లాడుతూ..‘నీ షాట్ సెలక‌్షన్ బాగుంది. దానితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. పరిస్థితులకు తగ్గట్లు షాట్ సెలెక‌్షన్ ఉండాలి’ అని చెప్పాడు. కాగా.. గవాస్కర్ సూచనను బాబర్ ఎంతో శ్రద్ధగా విన్నడం వీడియోలో చూడవచ్చు. కాగా.. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ టీమ్ కెప్టెన్‌కు సునీల్ గవాస్కర్ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడంపై కొంతమంది క్రికెట్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.
A ‘Sunny cap’ as a birthday gift for Babar Azam 🧢 pic.twitter.com/vmBDUfEoBy
— Sportstar (@sportstarweb) October 17, 2022