మరో వారం రోజుల తర్వాత జరగనున్న డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఇప్పటికే భారత క్రికెటర్లు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించేసారు. ఇక నిన్నే ఐపీఎల్ ఆడిన గుజరాత్, చెన్నై జట్టులోని జడేజా, గిల్, షమీ, రహానే ఇంగ్లాండ్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ గురించి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
గత రెండు నెలలుగా అభిమానులని అలరిస్తున్న వస్తున్న ఐపీఎల్ కి నిన్నటితో ఎండ్ కార్డు పడింది. గుజరాత్ టైటాన్స్ మీద చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టడంతో ధోని సేన 5 వ సారి ఈ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏంటి అని క్రికెట్ లవర్స్ చూసుకుంటే మరో వారంలో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూటీసి ఫైనల్లో ఆస్ట్రేలితో భారత్ తలపడబోతుంది. జూన్ 7 న జరగనున్న ఈ ఫైనల్ కి .. ఇంగ్లాండ్ లోని ఒవెల్ ఆతిధ్యమిస్తుంది. ఇక ఐపీఎల్ అయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం అందరూ ఈ డబ్ల్యూటీసి ఫైనల్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ గ్రాండ్ ఫైనల్ గురించి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఐపీఎల్ ముగిసిపోయింది. ఇక భారత జట్టు క్రికెట్ షెడ్యూల్ మొదలవ్వబోతుంది. ఈ ఏడాది పలు పెద్ద టోర్నీలు ఉన్న ఉండడంతో భారత జట్టు క్రికెట్ షెడ్యూల్ బిజీగా మారిపోయింది. ఇందులో భాగంగా మొదట ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసి ఫైనల్ ల్లో ఆడాల్సి ఉంది. మరో వారం రోజుల తర్వాత జరగనున్న ఈ ఫైనల్ కోసం ఇప్పటికే భారత క్రికెటర్లు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించేసారు. ఇక నిన్నే ఐపీఎల్ ఆడిన గుజరాత్, చెన్నై జట్టులోని జడేజా, గిల్, షమీ, రహానే ఇంగ్లాండ్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే గత రెండు నెలలుగా టీ 20 ఫార్మాట్ లో ఆడిన మన జట్టు.. ఇప్పుడు ఆసీస్ తో టెస్ట్ డబ్ల్యూటీసి ఫైనల్ ఆడి గెలవడం సవాలే అంటున్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
గవాస్కర్ మాట్లాడుతూ “దాదాపు ఐపీఎల్ లోని ఆటగాళ్లంతా ఐపీఎల్ పూర్తి చేసుకొని వెళ్తున్న వారే. టీ 20 ఫార్మాట్ నుంచి బయట పడి వారు ఎంత త్వరగా టెస్టు క్రికెట్ కి సన్నద్ధమవడం వారికి సవాలే. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా మాత్రమే ఈ ఫైనల్ కి సిద్ధంగా ఉన్నాడు. ఇక రహానే పునరాగమనంపై మాట్లాడుతూ రహానేకు ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం ఉంది. ఐదవ స్థానంలో అతడు కీలకం అవుతాడు. తానేంటో నిరూపించుకోవడానికి రహానేకు మరొక అవకాశం లభించింది. ఇంకా చాలా కాలం పాటు అతనికి క్రికెట్ ఆడగల సత్తా ఉందని నమ్ముతున్నాను. అని గవాస్కర్ తెలిపాడు. మరి గవాస్కర్ చెప్పినట్టు టీ 20నుంచి మనవాళ్ళు టెస్టు క్రికెట్ లో త్వరగా బయటకి రాగలరేమో చూద్దాం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.