సాధారణంగా బౌలర్ నో బాల్ వేస్తే.. దాన్ని అంపైర్ గుర్తించి తర్వాత నో బాల్‌గా ప్రకటించి ఆ తర్వాతి బంతి ఫ్రీ హిట్‌గా ప్రకటిస్తాడు. కానీ.. ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మాత్రం అన్ని తానే చేసుకున్నాడు. బ్యాటింగ్‌తో పాటు అంపైరింగ్ రోల్ కూడా తీసుకున్నాడు. ఒక బాల్‌ను నిర్భయంగా భారీ సిక్స్ కొట్టిన స్మిత్ వెంటనే అది నో బాల్ అని నెక్ట్స్ బాల్ ఫ్రీహిట్ అంటూ ప్రకటించుకున్నాడు. దీంతో అంపైర్లు అవాక్కైయ్యారు. కానీ.. స్మిత్ మాత్రం సిక్స్ కొట్టిన బాల్ ఎందుకు నో బాలో.. తర్వాతి బంతిని ఎందుకు ఫ్రీహిట్‌గా ప్రకటించాలో అంపైర్లకు సవిరంగా వివరించాడు. ఈ ఫన్నీ సంఘటన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. తొలి రెండు వన్డేల్లో హోం టీమ్ ఆసీస్ గెలుచుకుంది. చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌తో తన కెరీర్‌లో చివరి వన్డే ఆడుతున్న ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్ జిమ్మి నిషమ్ వేసిన ఇన్నింగ్స్ 38వ ఓవర్ రెండో బంతిని 69 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టీవ్‌స్మిత్ ఒక భారీ సిక్స్ కొట్టాడు. అప్పటి వరకు పర్ఫెక్ట్ క్రికెటింగ్ షాట్లతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్న స్మీత్ అంత అగ్రెసివ్‌గా ఆ షాట్ ఎందుకు ఆడాడో ఎవరీ అర్థం కాలేదు. అతి మరీ అంత చెత్త బంతికాదు.. లాంగ్ ఆన్‌లో ఫీల్డర్ కూడా ఉన్నాడు. అయినా కూడా స్మీత్ తెగించి సిక్స్‌కొట్టాడు. దీంతో షాక్ అయ్యారు.
కానీ.. అది నో బాల్ అని స్మీత్‌కు ముందే తెలుసూ.. అందుకు అంలాటి రిస్కీ షాట్ ఆడాడు. సర్కిల్ బయట నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫీల్డర్ కంటే ఒక ఫీల్డర్ ఎక్కువగా ఉన్నాడు. ఈ విషయాన్ని నీషమ్ బంతి వేయకముందే పసిగట్టిన స్మీత్ ఆ భారీ సిక్స్ కొట్టాడు. వెంటనే అది నో బాల్ అని.. తర్వాతి బంతి ఫ్రీహిట్ అంటూ తానే స్వయంగా ప్రకటించాడు. లెగ్ అంపైర్‌తో ఇది నో బాల్.. ఎందుకంటే బయట చూడు ఎంత మంది ఫీల్డర్లు ఉన్నారో.. అంటూ లెక్కపెట్టి మరీ చూపించి ఫ్రీ హిట్ ఇవ్వాలని ఆర్డర్ వేశాడు. దీంతో షాకైన అంపైర్లు.. పరిశీలించి నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చారు. కాగా.. స్మీత్ ఫీల్డ్‌ను ముందుగానే పసిగట్టి.. అంపైర్‌కు నో బాల్ అని చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రీజ్‌లో ఉన్నప్పుడు బ్యాటర్ బౌలర్ ఏ బాల్ వేస్తుండో అంచనా వేయడంతో పాటు ఫీల్డ్ సెట్‌పై కూడా ఒక కన్నేసి ఉంచాలని, దాని వల్ల మంచి గ్యాప్‌లు వేతకడంతో పాటు.. ఇలాంటి బోనస్‌లకు కూడా దొరుకుతాయని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: భారీ విజయం సాధించిన సచిన్ అండ్ టీమ్! దంచికొట్టిన సీనియర్ స్టార్
Steve Smith launching a filthy slog over the fence because he knew it was a no-ball due to the number of fielders outside the circle 🤯#AUSvNZ #PlayOfTheDay pic.twitter.com/T3LFFjsCB8
— cricket.com.au (@cricketcomau) September 11, 2022