టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఎదుగుదలను ఏమాత్రం జీర్ణించుకోలేని స్టీవ్ స్మిత్ దొరికిందే సందు అన్నట్లు.. గిల్‌ను తక్కువ చేస్తూ.. మాట్లాడాడు.
భారత క్రికెటర్ల గొప్పతనాన్ని ఎప్పుడూ హుందాగా ఒప్పుకోని ఆస్ట్రేలియా ఆటగాళ్లు మరోసారి తమ కుంచిస బుద్ధిని చూపించారు. టీమిండియాతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఆసీస్.. తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి పరువుపొగొట్టుకుంది. అయినా కూడా వారి అహం ఏమాత్రం తగ్గలేదు. ఎంతసేపు టీమిండియా ఆటగాళ్లను తక్కువచేసి మాట్లాడటం బాగా అలవాటైన కంగారులు మరోసారి అదే పంథాను కొనసాగించారు. ఆస్ట్రేలియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను చాలా తక్కువ చేస్తూ మాట్లాడాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శుబ్‌మన్ గిల్, ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఇద్దరిలో ఎవరూ ఫ్యూచర్ స్టార్ అని మీరు భావిస్తున్నారని స్మిత్‌ను అడగ్గా.. ఒక సీనియర్ క్రికెటర్‌గా చాలా హుందాగా చెప్పాల్సిన సమాధానాన్ని స్మిత్.. గిల్‌పై అక్కసు వెళ్లగక్కెలా ఇచ్చాడు. గిల్‌తో పోలిస్తే.. బ్రూక్ చాలా బెటర్ అని, టెక్నిక్ విషయంలో, విదేశీ పిచ్‌లపై అతను అద్భుతంగా ఆడుతున్నాడంటూ కాస్త అతి చేశాడు. గిల్, బ్రూక్ ఇద్దరు యువ క్రికెట్లను పోల్చే సమయంలో ఒక క్రికెట్ బెటర్‌గా అనిపిస్తే.. నా దృష్టిలో అతను బెస్ట్ అనుకుంటాన్నాని చెప్పాలి కానీ.. ఒకరిని కావాలని తక్కువ చేస్తూ.. కామెంట్ చేయకూడదు.
కానీ.. ఆసీస్ క్రికెటర్లు టీమిండియా ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం అంటే ఎంతో ఉత్సహం చూపిస్తారు. అందుకే అడిగి చిన్న ప్రశ్నకు అతిగా స్పందించిన స్మిత్.. టెక్నిక్, విదేశీ పిచ్‌లంటూ గిల్ టెక్నిన్ సరిగాలేదని చెప్పే ప్రయత్నం చేశాడు. నిజానికి ప్రస్తుతం ఉన్న యువ క్రికెటర్లలో గిల్, బ్రూక్ ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నవారే. ప్రస్తుతానికి ఇద్దరూ సమవుజ్జీలు, కానీ భవిష్యత్తులో ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చెప్పడం కష్టం. ఈ విషయంపై స్పందించిన భారత క్రికెట్ అభిమానులు స్మిత్‌పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు స్మిత్‌ను కోహ్లీతో పోల్చారని, ఇప్పుడు కోహ్లీ, స్మిత్‌ల స్థానం ఏంటో అందరికీ తెలిసిందే అంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Steve Smith Picks Harry Brook Over Shubman Gill as ‘next superstar’ #INDvAUS #IndianCricket #Australia #England pic.twitter.com/y7S6vcMcMP
— CRICKETNMORE (@cricketnmore) February 21, 2023