భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో వాలిపోయి.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్ స్పిన్ ఎటాక్‌కు, స్పిన్ పిచ్‌లకు భయపడి, భారత యువ స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో టీమిండియాను టెస్టు సిరీస్‌లో ఎదుర్కొవడం తమకు యాషెస్ సిరీస్ కన్నా ఎక్కువని అన్నాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ను టెస్టు క్రికెట్ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన సిరీస్‌గా చెప్పుకుంటారు. కానీ.. స్మిత్ మాత్రం.. యాషెస్ కంటే.. భారత్‌తో సిరీస్ ముఖ్యమని పేర్కొనడం సంచలనంగా మారింది.
అయితే.. చివరి 3 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడమే స్మిత్ వ్యాఖ్యలకు కారణం కావొచ్చు అంటూ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ఇటీవల కాలంలో చాలా పటిష్టంగా ఉంది. దేశం ఏదైనా వరుసబెట్టి సిరీస్‌లు గెలుస్తోంది. కానీ.. భారత్ విషయంలో వారి లెక్కలు తప్పుతున్నాయి. దానికి చివరి మూడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా భారత్‌ను ఓడించాలనే కసితో ఉంది ఆస్ట్రేలియా. స్మిత్ చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం స్పష్టమవుతోంది. సిరీస్ ఆరంభానికి పది రోజుల ముందే ఇండియాలో లాండైపోయిన ఆస్ట్రేలియా.. పాత పిచ్‌లపై, బాల్ టర్న్ అవుతున్న పిచ్‌లపై ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సిరీస్‌తో పాటు ఇదే ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా ఈ సిరీస్ ఉపయోగపడుతుందని ఆసీస్ భావిస్తోంది. అందుకే.. టీమిండియాతో సిరీస్‌ను తాము చాలా సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని ఇలాంటి వ్యాఖ్యలతో వ్యక్తం చేస్తోంది.
అయితే.. ఈ సిరీస్ ఆస్ట్రేలియా కంటే భారత్‌కే చాలా కీలకం. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ టీమిండియా ఆడాలంటే.. ఆసీస్‌ను 2-0 లేదా 3-1తో ఓడించాలి. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. సిరీస్ నెగ్గితేనే టీమిండియాకు రెండో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఆడే అవకాశం ఉంది. తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. కానీ.. ఈ సారి ఫైనల్ చేరి.. ఆస్ట్రేలియాను ఓడించి.. టెస్టు ఛాంపియన్‌గా నిలవాలని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది. మరి ఇలాంటి కీలక సిరీస్‌కు ముందు స్టీవ్ స్మిత్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.