అద్బుతాలేమి జరగలేదు. అందరూ ఆశలు పెట్టుకున్న కోహ్లీ ఏమి ఆడలేదు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక ఈ మ్యాచులో స్మిత్ ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు.
అద్బుతాలేమి జరగలేదు. అందరూ ఆశలు పెట్టుకున్న కోహ్లీ ఏమి ఆడలేదు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకి ఘోర పరాభవం ఎదురైంది. 3 వికెట్లకు 164 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు బోలాండ్ ఊహించని షాకిచ్చాడు. వరుస బంతుల్లో కోహ్లీ, జడేజా వికెట్లను తీసి కోలుకోలేని దెబ్బ తీసాడు. ఇక ఆ తర్వాత రహానే, శార్ధూల్ ఠాకూర్ కూడా ఎక్కువసేపు గ్రీజ్ లో నిలబడలేకపోయారు. ఇక ఉమేష్ యాదవ్, భరత్, సిరాజ్ ఇలా వచ్చి లా వెళ్లిపోయారు. దీంతో 234 పరుగులు మాత్రమే చేసి 209 పరుగుల భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ కి 4, బోలాండ్ కి 3 వికెట్లు దక్కగా.. స్టార్క్ కి 2, కమ్మిన్స్ కి ఒక వికెట్ లభించింది. ఇక ఈ మ్యాచులో స్మిత్ ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు.
స్టీవ్ స్మిత్ స్లిప్ లో ఫీల్డింగ్ ఎలా చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే స్లిప్స్ లో ఎన్నో గ్రేట్ క్యాచ్ లు అందుకున్న స్మిత్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ క్యాచ్ అందుకొని టీమిండియాకు పెద్ద షాక్ ఇచ్చాడు. బొలాండ్ వేసిన 47 ఓవర్లలో ఆఫ్ స్టంప్ కి దూరంగా బంతిని వేసాడు. దీంతో ఆ బంతిని వెంటాడిన కోహ్లీ.. సెకండ్ స్లిప్ లో స్మిత్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కి పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఈ క్యాచ్ స్మిత్ సూపర్ డైవ్‌తో అందుకోవడం గమనార్హం. దీంతో స్మిత్ పట్టిన క్యాచ్‌కు కోహ్లీ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక స్మిత్ ఈ క్యాటిక్ పట్టడం ద్వారా ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్యాచ్ తో స్మిత్ టెస్టుల్లో ఇప్పటివరకు 157 అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న మూడో ప్లేయర్ గా నిలిచాడు. ఈ లిస్టులు;ఓ ఆసీస్ మాజీ సారధి రికీ పాంటింగ్ 196 క్యాచులతో అగ్ర స్థానంలో ఉండగా.. 181 క్యాచులతో మార్క్ వా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక తాజాగా అలెన్ బోర్డర్ ని వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. మొత్తానికి స్మిత్ పట్టిన కోహ్లీ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.