ఐపీఎల్-2022 మెగా వేలం పక్రియ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు అందరి కళ్లు ఐపీఎల్ ఎపుడు మొదలవుతుందా అని. ఈసారి లక్నో, అహ్మదాబాద్ ప్రాంచైజీల రూపంలో 2 కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్-2022 షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. పది జట్లు పాల్గొనే 15వ సీజన్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభమై మే 29న ముగియనుంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచులను ఆడనుంది. ఈ సీజన్ లో మొత్తం 70 లీగ్ మ్యాచులు.. ఫైనల్ తో కలిపి మరో నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచులు జరగనున్నాయి.
ఈ ఏడాది అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూణే నగరాల్లోనిలోని 6 వేదికల్లో జరిగే అవకాశం ఉంది. మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్.. పూణేలోని ఎంసీఏ స్టేడియంలు ఇప్పటికే ఖరారు కాగా.. మహరాష్ట్రలోని రిలయన్స్ జియో స్టేడియంని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లే ఆప్స్, ఫైనల్స్ కి అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం వేదిక కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆయా స్టేడియాలను.. ఆయా క్రికెట్ ఆసోసియేషన్ సిద్దం చేసినట్లు వినికిడి.టోర్నీ ఎపుడు ప్రారంభమైన.. ప్రసారం చేయడానికి బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా.. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని.. ఐపీఎల్‌కి ప్రచారకర్తగా ఆయన్నే ఎంచుకుంటోంది స్టార్ స్పోర్ట్స్ ఛానెల్. అందుకు తగ్గట్టుగా.. ఐపీఎల్ 2022 సీజన్ ప్రచారం కోసం ధోనీని.. ఆటో జానీగా మార్చేసింది.
ప్రస్తుత సీజన్‌కి సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో వదిలింది స్టార్ స్పోర్ట్స్ ఛానెల్. ఈ యాడ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ.. ఖాకీ యూనిఫామ్‌లో గుబురు మీసాలతో పూల పూల చేతి రుమాలుతో ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తలైవా ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. క్రికెట్ కు దూరమైన తర్వాత ఎమ్మెస్ ధోనీ.. మరో తలైవాగా సినిమాల్లోకి రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Cue the 🥁🥁🥁, ’cause he is 🔙 in a new avatar!
How did you react to #DhonisNewLook? Let us know with an emoji! pic.twitter.com/Kv6qMr6iz5
— Star Sports (@StarSportsIndia) February 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి