శ్రీలంక అగ్నిగుండంలా మండిపోతోంది. ఆందోళనకారులపై పోలీసులు దాడులు, కాల్పులు జరుపుతున్న తీరు చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కి పడుతోంది. ఇప్పటివరకు అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో ఐదుగురు వరకు ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మంది వరకు గాయపడినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను అణచివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వైఫల్యం కారణంగా శ్రీలంకలో ఈ పరిస్థితి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులపై శ్రీలంక మాజీ, ప్రస్తుత క్రకెటర్లు స్పందిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: శ్రీలంక సంక్షోభం: రాజీనామా చేసిన ప్రధాని మహింద రాజపక్స
శ్రీలంకలో సంక్షోభంపై మాజీ క్రికెట్ దిగ్గజం మేహళ జయవర్దనే, శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ సంగక్కర సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజల ప్రాథమిక హక్కును హరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నిరసనకారులపై ప్రభుత్వం అండతో దుండగులు, గూండాలు దాడి చేస్తున్నారన్నారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని క్రికెటర్లు తప్పుబట్టారు. అధికార పార్టీ వర్గాల సమక్షంలో నిరసన తెలుపుతున్న మహిళలపై దాడిచేస్తున్న వీడియో షేర్ చేసిన జయవర్దనే అలా దాడి చేయడం సిగ్గుచేటంటూ కామెంట్ చేశాడు.
This is how they attacked a female protester in front of police officers … shame on you @PodujanaParty and government of SL for using violence. https://t.co/hA26f5q5eX
— Mahela Jayawardena (@MahelaJay) May 9, 2022
ప్రస్తుత శ్రీలంక క్రికెటర్లు సైతం ప్రభుత్వం తీరును, వారి దేశంలో జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించారు. శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు. అమాయక, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేయడం పిరికి చర్య మాత్రమే కాదు.. అనాగరిక చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశంకోసం ఏకమైన వారి పక్షాన తానుకూడా ఉంటానంటూ హామీ ఇచ్చాడు. వికెట్ కీపర్ బ్యాట్సమన్ నిరోషన్ డిక్‌వెల్లా స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై వ్యవస్థీకృత దాడులు జరగడం తనని కలచి వేసిందంటూ ట్వీట్ చేశాడు. వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెబుతోంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మాత్రం ఆస్ట్రేలియా తమ పర్యటనను రద్దు చేసుకునే అవకాశం లేకపోలేదు. శ్రీలంక క్రికెటర్ల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రుపంలో తెలియజేయండి.
1 down #poeplepower https://t.co/RFXTSYPzHR
— Kumar Sangakkara (@KumarSanga2) May 9, 2022
Cowardly and Barbaric! Two words that sums up today’s attack on innocent & PEACEFUL Sri Lankan Protesters. I am disappointed to even think we have such leadership in our country.
My heart is with everyone standing United for this cause #අරගලයට_ජය
— Wanindu Hasaranga (@Wanindu49) May 9, 2022
Utterly disappointed about the well organized attacks towards the peaceful and innocent protestors…
Disgusting…I stand by you fellow citizens who are fighting for our rights.Stay strong Sri Lanka. #ND48 https://t.co/BGLGubcI1Y
— Niroshan Dickwella (@NiroshanDikka) May 9, 2022