తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను కివీస్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టీ20 జరుగుతున్న వేళ ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ క్రీడాలోకంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫుట్ బాల్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది క్రికెట్. దాంతో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుంటే మైదానంలో భారీ భద్రత కల్పించాల్సి వస్తుంది ఆతిథ్య దేశాలకు. భద్రత కారణాల దృష్ట్యా పాకిస్థాన్ దేశానికి టీమిండియా వెళ్లడం లేదు. అలాంటి భద్రతాలోపానికి సంబంధించిన ఓ చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను కివీస్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టీ20 జరుగుతున్న వేళ ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ను కివీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక చివరిదైన టీ20 మ్యాచ్ లో లంక భారీ స్కోర్ చేసినప్పటికీ ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది. ఈ మ్యాచ్ కు క్వీన్స్ టన్ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. 9 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ మైదానం క్రికెట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. జట్టులో కుశాల్ మెండిస్ 73 పరుగులతో సత్తా చాటగా.. డి సిల్వా 9 బంతుల్లో 2 సిక్స్ లు, ఓ ఫోర్ తో 20 పరుగులు చేసి మెరిపించాడు.
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు ఒక్క బంతి మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిఛేదించింది. జట్టులో టిమ్ సైఫర్ట్ 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 88 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంటే ఓ ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుంటే మనుషులను తాకే రీతిలో.. విమానం గ్రౌండ్ పై నుంచి వెళ్లింది. దూరం నుంచి చూస్తే.. విమానం గ్రౌండ్లో దిగుతుందా అన్న అనుమానం కలగక మానదు. క్విన్స్ టన్ గ్రౌండ్ పక్కనే విమానశ్రయం ఉండటం చేత.. విమానాలు ప్రేక్షకుల తలలపై నుంచే పోతున్నాయి. ప్రస్తుతం ఇదే పిక్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. అయితే భద్రత దృష్ట్యా ఇది అత్యంత ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. పాక్ లో శ్రీలంక జట్టుపై దాడి జరిగిన సంగతి అందరికి తెలిసిందే. మరి అలాంటి సంఘటన జరిగిన క్రమంలో విమానం ఇలా ఆటగాళ్ల పై నుంచే పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Picture of the day.
Queenstown ground in New Zealand. pic.twitter.com/rjEHNdyjib
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023