శ్రీలంక.. ఈ జట్టుపై ఆసియా కప్పు గురించే కాదు.. అసలు క్రికెట్ విషయంలోనే ఎలాంటి అంచనాలు లేవు. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఈ జట్టు ఇటీవలికాలంలో ఎంతో పేలవంగా కనిపించింది. దానికి తోడు ఆసియా కప్ 2022లో మొదటి మ్యాచ్‌లోనే ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాభవం చవిచూడటంతో ఈ జట్టు కథ ముగిసింది అనుకున్నారు. కానీ, పడి లేచిన కెరటంలా శ్రీలంక పోరాడిన తీరు అందరినీ మంత్రిముగ్ధులను చేసింది. మొదటి మ్యాచ్ తర్వాత ఆసియా కప్ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్‌లో పరాజయం లేదు. వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించి.. శ్రీలంక జట్టు ఆసియా కప్పు సొంతం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ ఓడిన వెంటనే అంతా మ్యాచ్ కూడా ఓడిపోతుంది. పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని భావించారు. దానికి తోడు ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరడంతో ఓటమి ఖాయం అనుకున్నారు. కానీ, వారి అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. రాజపక్స(71), హసరంగ(3) అద్భుతమైన బ్యాటింగ్‌తో శ్రీలంక టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో పాకిస్తాన్ టీమ్ తడబడింది. రిజ్వాన్(55), ఇఫ్తికర్ అహ్మద్(32) మినహా మరే ప్లేయర్ రాణించలేదు. వెరసి నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లు మదుషన్(4వికెట్లు), హసరంగ(3వికెట్లు) అదరగొట్టారు. వెరసి శ్రీలంక ఆరోసారి ఆసియా కప్పును అందుకొంది.
6th title ✅😉 https://t.co/5Mvot46Omm pic.twitter.com/uks6F2YTgw
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2022
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు శ్రీలంక ప్లేయర్లు, అభిమానులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఖలీద్ మహ్ముద్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతి నుంచే వాళ్లు ఒక్కొక్కరిగా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కప్ కొట్టిన తర్వాత మరోసారి ఖలీద్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. “శ్రీలంక టీమ్‌లో ఒక్క వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా లేడు” అంటూ బీసీబీ డైరెక్టర్ ఖలీద్ మహ్ముద్ కామెంట్ చేశాడు. ఆ తర్వాత లంక జట్టు ఆటగాళ్లు సమాధానం చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఒక్క శ్రీలంకే కాదు క్రికెట్ అభిమానులు అంతా సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ డైరెక్టర్ కామెంట్ పోస్ట్ చేస్తూ లంక ఛాంపియన్స్ ఫొటోను పెడుతున్నారు. మరి.. ఇప్పటికైనా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఖలీద్ మహ్ముద్ అతని వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాడేమో చూడాలి. ఆసియా కప్‌లో శ్రీలంక జట్టు ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you BCB director
🥹🇱🇰💪❤️ pic.twitter.com/oIxr6keizj— Azi〽️ Az〽️ (@azm_david_villa) September 11, 2022
No need to have world class players, when you have 11 brothers ❤️ pic.twitter.com/H0rYESlF6i
— Maheesh Theekshana (@maheesht61) September 2, 2022
Sri Lanka have won 5/5 matches since BCB’s Director comment of “I don’t see any World Class bowler in Sri Lanka side”.
Well played.@MahelaJay #AsiaCup2022Final #SLvsPAK— Himanshu 🇮🇳 (@illogical_22) September 11, 2022