క్రికెట్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు మార్గం సుగమైంది. ఈ ఏడాది శ్రీలంక వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీలో భారత్- పాకిస్తాన్‌లు మరో సారి తలపడనున్నాయి. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 6 జట్లు పాల్గోనున్నాయి. ఇక ఈ సారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
ఐదు టెస్టు జట్లు.. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ డైరెక్ట్ గా అర్హత సాధించగా.. క్వాలిఫయర్ మ్యాచ్ ల ద్వారా మరో జట్టు చేరనుంది. ఆగష్టు 20 నుంచి యుఎఇ, కువైట్, సింగపూర్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచులు జరగనున్నాయి. 1984లో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పటివరకు 14 సార్లు జరగగా.. 7 సార్లు భారత జట్టు ఛాంపియన్స్ గా నిలిచింది. 5 సార్లు శ్రీలంక, 2 సార్లు పాకిస్తాన్ విజేతగా నిలిచాయి. చివరిసారిగా 2018లో యూఏఈ వేదికగా జరిగిన ఈ టోర్నీని భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక శ్రీలంక వేదికగా 2020 లో జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా 2021 కి వాయిదా పడి.. అది కాస్తా 2022 కి చేరింది. దీంతో 2022 కి ఆతిథ్యమివ్వాల్సిన పాకిస్తాన్ 2023లో ఆతిథ్యమివ్వనుంది.
ఇక భారత్-పాక్ దేశాల నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇప్పటిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో క్రికెట్ అభిమానులు ఐసీసీ ఈవెంట్‌లు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోను ఇరు దేశాలు తలపడనున్నాయి.
🚨 Sri Lanka to host Asia Cup 2022 🚨
6 Asian teams will participate in the T20I tournament set to start on 27 August 📅
Either UAE, Kuwait, Singapore or Hong Kong will qualify as the sixth team to lock horns with 🇵🇰, 🇮🇳, 🇧🇩, 🇱🇰, and 🇦🇫 🥊#AsiaCup #AsiaCup2022 #PAKvIND pic.twitter.com/HgC3qdgw2n
— CricWick (@CricWick) March 19, 2022
🚨 Breaking News 🚨
Sri Lanka to host Asia Cup 2022
6 Teams: Pakistan, India, Bangladesh, Sri Lanka, Afghanistan & a Qualifying team#AsiaCup #AsiaCup2022 pic.twitter.com/Moz5OxxWnu— CricWorld (@CricWorld21) March 19, 2022
Asia Cup 2022 format and dates announced.
Read more: https://t.co/fE3bCLnNYy#AsiaCup2022 pic.twitter.com/ITWGlq9vJ7
— Cricket Pakistan (@cricketpakcompk) March 19, 2022