శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే ల సీరీస్ ని టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన రెండో వన్డే లో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా యువకులతో కూడిన భారత జట్టు.., ఇంకా ఒక వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే కప్ ని సొంతం చేసుకోవడం విశేషం. కానీ.., మ్యాచ్ తరువాత శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ దాసున్ షానకా, హెడ్ కోచ్, మిక్కీ ఆర్థర్ మధ్య గ్రౌండ్ లోనే గొడవ జరగడం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది.
రెండో వన్డే లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్ చేశారు. అవిష్కా ఫెర్నాండో, చరిత్ అసలంక హాఫ్ సెంచరీలతో రాణించడంతో లంక ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. అయితే.., ఛేజింగ్ లో భారత్ ముందుగా తడబడింది. వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోతూ.., ఒకానొక దశలో 193 పరుగులకే 7 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ సమయంలో లంక జట్టు విజయం సాధించడం పక్కా అని అంతా అనుకున్నారు. అయితే.., దీపక్ చాహర్ ఓ అసామాన్య ఇన్నింగ్స్ తో మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి, టీమ్ ఇండియాకి విజయాన్ని కట్టబెట్టాడు.
కెప్టెన్ దాసున్ షానకా, హెడ్ కోచ్, మిక్కీ ఆర్థర్ మధ్య గొడవకి టీమ్ ఇండియా గెలుపే కారణం అయ్యింది. కచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో కెప్టెన్ దాసున్ షానకా అనుభవ లేమి కారణంగానే మ్యాచ్ ఓడిపోయామని మిక్కీ ఆర్థర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీపక్ చాహర్ మొదటి నుండి ఆఫ్ స్టంప్ అవతల పడుతున్న బంతులను మాత్రమే లిఫ్ట్ చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో షానకా తన బౌలర్స్ చేత లైన్ మార్పించే ప్రయత్నం చేయలేదు.
మ్యాచ్ మధ్యలో ఇదే విషయాన్ని మిక్కీ ఆర్థర్ కెప్టెన్ కి చేరవేశాడు. అవే బంతులను కొనసాగిస్తూ.., కవర్స్ పక్కన.. డీప్ స్లిప్ లో కూడా ఓ ఫీల్డర్ ని మోహరించామని వ్యూహం చెప్పి పంపాడు. కానీ.., ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో దాసున్ షానకా దారుణంగా విఫలం అయ్యాడు. చాహర్ కొట్టిన చాలా ఫోర్లు ఎడ్జెస్ తీసుకుని థర్డ్ మేన్ దిశగానే వెళ్లాయి. దీంతో.., మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మిక్కీ ఆర్థర్ అసహనంగా కనిపించాడు.
ఇక మ్యాచ్ ఓడిపోయాక గ్రౌండ్ లోకి వచ్చిన మిక్కీ ఆర్థర్.. ఇదే విషయంపై దాసున్ షానకాని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనికి.. షానకా కూడా అంతే సీరియస్ గా స్పందించడంతో వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ మొత్తం సంఘటన గ్రౌండ్ లోనే జరగడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మన కోచ్ ద్రావిడ్ మాత్రం టీమ్ క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా.., తరువాత క్రీజ్ లోకి రాబోయే ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించాడు.
— cric fun (@cric12222) July 20, 2021
అయితే.. తాజాగా ఈ గొడవపై శ్రీలంక మాజీ ఆటగాడు ఆర్నాల్డ్ స్పందించాడు. ఓ నేషనల్ టీమ్ కోచ్ కెప్టెన్ తో ఇలా గొడవపడటం బాగాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి కోచ్ మిక్కీ అదే సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చాడు. “డియర్ ఆర్నాల్డ్.. గెలిచినా, ఓడినా దానికి మేము ఇద్దరమే బాధ్యులము.
ఇన్నాళ్లు కలిసే ప్రయాణించాం, ఇకపై కూడా కలిసే ప్రయాణిస్తూ.. నేర్చుకుంటాం. కచ్చితంగా గెలుస్తాం అనుకున్న మ్యాచ్ లో ఓటమి పాలవ్వడం కాస్త బాధించింది. ఆ బాధలోనే ఇద్దరం కాస్త లైన్ దాటాము. కానీ.., మీరంతా అనుకుంటున్నట్టు మేము అక్కడ గొడవ పడలేదు. అది ఒక మంచి డిబేట్ మాత్రమే. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తే బాగుంటుంది” అని మిక్కీ ఆర్థర్ ట్వీట్ చేశాడు.
మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.