టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రేక్షకుల హృదయాలను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అది బౌలింగ్ తో కాదులెండి.. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో బుమ్రా ప్రదర్శించిన స్పోర్ట్స్ స్పిరిట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు ముగిసిన తర్వాత శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ ను అభినందించాడు. అతను చినస్వామి స్టేడియంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: గురువుని మించిన శిష్యుడు! తొలి వికెట్ కీపర్ గా పంత్..
శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ భారత్ తో టెస్టు సిరీస్ తర్వాత తన కెరీర్ ను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ టెస్టులో రెండో రోజు శ్రీలంక బౌలింగ్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ కలిసి శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. క్రికెట్ ప్రపంచంలో అతను సాధించిన విజయాలు, ఘనతలను గుర్తుచేస్తూ సురంగ లక్మల్ ను విరాట్, ద్రవిడ్ అభినందించారు. వాళ్లిద్దరే కాదు.. టీమిండియా నుంచి చాలా మంది లక్మల్ ను అభినందించారు.
India give Suranga Lakmal a classy send-off after his final Test innings 🤝#INDvSL pic.twitter.com/rUrBKK6JZC
— Sport360° (@Sport360) March 14, 2022
శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లక్మల్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అతను గ్రౌండ్ నుంచి పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో బుమ్రా పరిగెత్తుకుంటూ వెళ్లి లక్మల్ ను నవ్వుతూ అభినందించాడు. బుమ్రాను చూసి ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్, రిషబ్ పంత్, హనుమ విహారి, అక్షర్ పటేల్ ఇలా టీమిండియా ఆటగాళ్లు వెళ్లి సురంగ లక్మల్ ను అభినందించారు. బౌండిరీ వద్ద శ్రీలంక ఆటగాళ్లు సైతం లక్మల్ కు ఎదురొచ్చి అతడిని అభినందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుమ్రా చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Spirit of Cricket at its best as #TeamIndia congratulate Suranga Lakmal who played his last international match 🤜🤛 #SpiritOfCricket | #INDvSL | #INDvsSL pic.twitter.com/qkJuzO41fh
— Indian Cricket Team (@Teamindia_fans) March 14, 2022