భారత్-వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డిండ్ ఎంచుకున్న టీమిండియా విండీస్‌ను ఒక మోస్తారు స్కోర్‌కే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విండీస్ 157 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 61 పరుగులతో అదరగొట్టాడు. దీంతో వెస్టిండీస్ క్యాంప్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ కూడా ఫుల్ ఖుషీ అయింది.
దానికి కారణం ఇటివల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పూరన్‌ను తమ జట్టులోకి తీసుకోవడమే. కాగా మెగా వేలంలో పూరన్‌కు రూ.10.75 కోట్ల భారీ ధర ఇచ్చి SRH కొనుగోలు చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఫామ్‌లో లేని పూరన్‌పై అంత ధర ఎందుకు పెట్టారనే విమర్శలు వచ్చాయి. SRH సరైన ప్లేయర్లను తీసుకోలేని సొంత ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కానీ విమర్శకుల నోర్లు మూయిస్తూ.. పూరన్ అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేసే పూరన్ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. సూపర్ హాఫ్ సెంచరీతో మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. మరి పూరన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ryt now ..,
Most Happiest Human in India 💯😅#IndvsWI #KavyaMaran #SRH #Pooran pic.twitter.com/ykDwKNA7VZ
— ɴᴏᴛ ᴘᴇʀᴍᴀɴᴇɴᴛ 👑 (@Not_Permanent_) February 16, 2022