IPL టీ20 క్రికెట్ గతినే మార్చేసిన టోర్నీ. అదీకాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ టోర్నీగా కూడా చరిత్రలోకి ఎక్కింది. ఐపీఎల్ తోనే టీమిండియాలో గల ఎంతో మంది ప్రతిభగల ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారన్నది కాదనలేని వాస్తవం. అయితే ఈ ఐపీఎల్ కారణంగానే టీమిండియా వరల్డ్ కప్ లు కొట్టలేకపోతోంది అని అభిమానులు విమర్శిస్తున్నారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సైతం భారత్ సెమీస్ లోనే ఇంటి దారి పట్టింది. అయితే టీమిండియా ఆటగాళ్లతో పాటు చాలా మంది విదేశీ ప్లేయర్లు సైతం ఐపీఎల్ టోర్నీలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో విఫలం అయిన ఆటగాళ్లను ప్రాంఛైజీలు వదులుకోనున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైద్రాబాద్ స్టార్ బ్యాటర్లు అయిన కేన్ విలియమ్సన్ ను, నికోలస్ పూరన్ ను వదిలించుకోనున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేన్ విలియమ్సన్.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యున్నత ఆటగాళ్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ గత కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కేన్ మావ. పరుగులు చేయడం అటుంచితే.. టీ20ల్లో కూడా టెస్టు బ్యాటింగ్ చేస్తూ జట్టు పరాజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ముగిసిన మినీ వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయ్యాడు. టెస్టు బ్యాటింగ్ చేసి సెమీస్ లో న్యూజిలాండ్ ఓటమికి కారణం అయ్యాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే 2023 ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే హైద్రాబాద్ సన్ రైజర్స్ జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కేన్ విలియమ్సన్ ను, నికోలస్ పూరన్ ను రిలీజ్ చేయనుంది. వీరిద్దరు ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నారు. పూరన్ సైతం గత కొంత కాలంగా పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ కారణంగానే వారిని యాజమాన్యం వదిలించుకోనుంది.
According to various reports, Mayank Agarwal, Kane Williamson, Nicholas Pooran, Shahrukh Khan, Ravichandran Ashwin and Jason Holder are all set to be released by their respective franchises. #SRH #PBKS #LSG #IPL2023 #CricketTwitter pic.twitter.com/rrTSr2a2st
— Sportskeeda (@Sportskeeda) November 15, 2022
ఈ నేపథ్యంలో SRH తో పాటు మరికొన్ని ప్రాంచైజీలు కూడా కీలక ఆటగాళ్లను రిలీజ్ చేస్తోంది. వారిలో మయాంక్ అగర్వాల్, షారుఖ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్ తో పాటుగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం దేవ్ దత్ పడిక్కల్ ను రిలీజ్ చేస్తోంది. అయితే ఆర్సీబీ మాత్రం మాక్స్ వెల్ ను వదులుకోవడానికి సిద్దంగా లేదు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన వారిని వేలంలో తక్కువ ధరకు అదే జట్టు మళ్లీ కొనుగోలు చేసినా ఆశ్చర్యం లేదు. అదీ కాక ఐపీఎల్ వేలంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పద్దతి కూడా ఉంది. అంటే ఒక జట్టులోని ఆటగాడిని తొలగిస్తున్నారని తెలిస్తే.. మరో జట్టు.. ఆ ఆటగాడు నచ్చితే అతడిని తీసుకుంటుంది. అందుకు చెల్లించాల్సిన డబ్బులను సదరు యాజమాన్యానికి చెల్లిస్తుంది. శార్దుల్ ఠాకూర్ ఇలాగే మారాడు. ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
SRH likely to release Pooran & RR likely to release Padikkal. (Source – Cricbuzz)
— Johns. (@CricCrazyJohns) November 14, 2022